
సెల్ టవర్ ఎక్కి హల్‌చల్
నిజామాబాద్ రూరల్: అర్హత ఉన్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తూ, సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. వివరాలు ఇలా.. మండలంలోని మల్లారం గ్రామనికి చెందిన ఎం. సాయిలు అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఉందని, ఇటీవల ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. కానీ అధికారులు అనర్హతగా ప్రకటించడంతో గురువారం అతడు మల్లారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ విషయంపై స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన ఫోన్లో అక్కడ ఉన్న స్థానిక నాయకులతో మాట్లాడి సెల్‌టవర్ ఎక్కిన సాయిలుకు కాన్ఫరెన్స్ ద్వారా ఫోన్‌లో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన సెల్‌టవర్ దిగి ఎమ్మెల్యే భూపతిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సాయిలు సెల్‌టవర్ దిగడంతో మల్లారం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని నిరసన
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హామీతో దిగివచ్చిన వ్యక్తి