
ఎప్‌సెట్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
కామారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఎప్‌సెట్(ఈఏపీసీఈటీ) ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాకేంద్రంలోని సాందీపని జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో గోలివడ్డ నవదీప్ 3,433వ ర్యాంకు, సర్వత్ ఫాతిమా 3,850, సాయి రిశ్వితరెడ్డి 4,265, భాగ్యలక్ష్మి 6,001, మన్సీరా మలిహా 6,399, బిలాల్ 9,177, రిత్విక్ 9,965 ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో సీహెచ్ శివకార్తీక్ 6,979వ ర్యాంకు సాధించాడు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రతినిధులు బాలాజీరావు, సాయిబాబా, రాజశేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
బాన్సువాడ విద్యార్థులు..
బాన్సువాడ : ప్రభుత్వం అదివారం ప్రకటించిన ఎప్‌సెట్ ఫలితాల్లో బాన్సువాడ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. పట్టణానికి చెందిన అర్షపల్లి శ్రీశౌర్యకు 905 వ ర్యాంకు, మామిళ్ల అక్షయకు 1,855వ ర్యాంకు, ర్యాల తేజస్వినికి 3,419వ ర్యాంకు వచ్చాయి. తమ పిల్లలు మంచి ఫలితాలు సాధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్‌సెట్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

ఎప్‌సెట్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

ఎప్‌సెట్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ