
హుటాహుటిన విధుల్లోకి వెళ్లిన మద్నూర్ జవాన్
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రానికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ బండివార్ పరుశురాం మిలటరీ ఉన్నత అధికారుల ఆదేశాలతో శుక్రవారం హుటాహుటిన విధుల్లో చేరేందుకు తరలివెళ్లారు. భారత్–పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో అత్యవసర పరిస్థితులతో విధుల్లోకి చేరినట్లు పరుశురాం కుటుంబ సభ్యులు తెలిపారు. పరుశురాం ఈ నెల 2న మద్నూర్‌కు సెలవులపై వచ్చాడని, ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ఉండగా హఠాత్తుగా బయలుదేరి వెళ్లినట్లు వారు తెలిపారు.
భారత సైన్యానికి
మద్దతుగా పూజలు
మద్నూర్/భిక్కనూరు : భారత సైన్యానికి మద్దతుగా పలు చోట్ల ప్రజలు పూజలు నిర్వహించారు. మద్నూర్ మండలం సలాబత్‌పూర్ హనుమాన్ ఆలయంలో శుక్రవారం భారత సైన్యానికి మద్దతుగా ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయంలో శుక్రవారం పూజలు చేశారు. పూజారులు రామగిరిశర్మ,రాజేశ్వరశర్మలు స్వామివారికి ఈ విషయమై ప్రత్యేక అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. సైనికులపై స్వామి వారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగచేసి వారిని కాపాడాలని వేడుకున్నారు.

హుటాహుటిన విధుల్లోకి వెళ్లిన మద్నూర్ జవాన్