
అసంపూర్తిగా అంగన్‌వాడీ భవనాలు
నస్రుల్లాబాద్: మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గతంలో రూ. తొమ్మిది లక్షల నిధులు కేటాయించి భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. పనులు మొదట పెట్టి ఏళ్లు గడుస్తున్నా అంగన్‌వాడీ భవనాలు మాత్రం పూర్తి కావడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
అద్దె భవనాల్లో..
అంగన్‌వాడీ భవనాలకు సంబంధిత కాంట్రాక్టర్లు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినా అనుకున్న ప్లాన్ ప్రకారం నిర్మాణ పనులు పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేశారు. దీంతో చిన్నారులు అద్దె భవనాల్లోనే చదువును కొనసాగిస్తున్నారు. పలు చోట్ల ఇరుకు గదులు, రేకుల ఇళ్లలో కాలం వెల్లదీస్తున్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి, రాముల గుట్ట తండా, ఫకీరానాయక్ తండాల్లో ఉన్న కేంద్రాలు ప్రారంభించి మధ్యలోనే నిలిపేశారు. అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో మందు బాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యాకలాపాలకు నిలయంగా మారింది. శాశ్వత భవన పనులు పూర్తి కాకపోవడంతో చి న్నారులు అద్దె భవనంలో ఇరుకు గదులలో అ వస్తలు పడుతున్నారు. నిధులను కేటాయించి పను లు మొదలు పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రాముల గుట్ట తండాలో నిలిచిన పనులు
అసాంఘిక కార్యకలాపాలకు
అడ్డాలుగా మారిన పరిస్థితి
నిధులు లేక పూర్తి కాని నిర్మాణాలు
అద్దె గదిలో చిన్నారుల అవస్థలు
పనులను పూర్తి చేయాలి
చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇరుకు గదుల్లో ఉంటున్నా అధికారులకు స్పందించడం లేదు. సరైన భవనాలు లేక అంగన్‌వాడీ సరుకులు సైతం ఎలుకలకు ఆహారంగా మారుతున్నాయి. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు చేపట్టాలి.
– పుట్ట భాస్కర్, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు

అసంపూర్తిగా అంగన్‌వాడీ భవనాలు