
40 ఏళ్ల తర్వాత ఒక్కచోటికి..
దోమకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. 1984–85 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులు దాదాపు 40 సంవత్సరాల తర్వాత 45 మంది పూర్వ విద్యార్థులు కలుసుకుని వారి బాగోగులు మాట్లాడుకున్నారు. వారి వ్యక్తిగత వృత్తి వివరాలు, పిల్లల వివరాలు చేస్తున్న ఉద్యోగా లు తదితర విషయాలపై పరిచయం చేసుకున్నారు. మరణించిన తమ తోటి పూర్వ విద్యార్థుల మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బాపురెడ్డి, శ్రీనివాస్‌శర్మ, రాంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, రాజేందర్, శ్రీనివాస్‌రెడ్డి, సిద్దరామేశ్వర్‌రెడ్డి, నర్సింలు, నాగరాజు పాల్గొన్నారు.
నేహాశెట్టి సందడి
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ పట్టణంలో మంగళవారం డీజే టిల్లు సినిమా ఫేమ్ నేహా శెట్టి సందడి చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఎల్‌వీఆర్ షాపింగ్ మాల్‌ను మంగళవారం సినీనటి నేహాశెట్టి, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా నేహా శెట్టితో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, నాయకులు పండిత్ పవన్, ఎల్‌వీఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసునంటూ
బెదిరించి నగదు అపహరణ
నవీపేట: నవీపేట శివారులో ఓ వ్యక్తి పోలీసునంటూ బెదిరించి, ఒకరి వద్ద నగదు అపహరించాడు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మద్దెపల్లికి చెందిన యుడ్ కిషన్ ఈనెల 5న నవీపేట నుంచి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. నవీపేట శివారులో గు ర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి కిషన్ వాహనా న్ని ఆపాడు. పోలీసునంటూ బెదిరించి కిషన్ జేబులోని రూ.10500ల నగదుతోపాటు అన్ని కార్డులను బలవంతంగా లాక్కొని, పోలీస్ స్టే షన్‌కు రమ్మని పారిపోయాడు. అతని ఆచూకీ కోసం ఆరా తీయగా పోలీసు కాదని తెలుసుకున్నాడు. అతడిని పట్టుకుని చర్యలు తీసుకోవా లని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

40 ఏళ్ల తర్వాత ఒక్కచోటికి..