
తొమ్మిదేళ్లుగా శతశాతం ఉత్తీర్ణత
బీబీపేట : ఉత్తీర్ణులవడమే కాదు.. మంచి మార్కు లు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మాందాపూ ర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు. ఈ పాఠశాల వరుసగా తొమ్మిదోసారి పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతను నమోదు చేసింది. ఈసారి 36 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారు. ఇందులో 17 మంది 500 మార్కులపైన సాధించడం గమనార్హం. తమ పాఠశాల విద్యార్థులు 2017 సంవత్సరం నుంచి వంద శాతం పాసవుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఎంతోమంది ఐఐఐటీకి ఎంపికయ్యారని పేర్కొన్నారు.
మాందాపూర్‌లో ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థులు (ఫైల్)
ఉత్తమ ఫలితాల కోసం..
ఈ ఏడాది పదో తరగతిలో
17 మందికి 500లకుపైగా మార్కులు
ఆదర్శంగా నిలుస్తున్న
మాందాపూర్ సర్కారు బడి
ఉత్తమ ఫలితాల కోసం విద్యార్థులతోపాటు ఉ పాధ్యాయులు శ్రమిస్తున్నారు. ఉపాధ్యాయులు రోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఉద యం 8 గంటలకే పదో తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి. ప్రత్యేక తరగతులు నిర్వహించే సమయంలో రాత్రి 9 గంటల వరకు విద్యార్థులతో చదివిస్తారు. రోజూ ఇద్దరు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులను పర్యవేక్షిస్తారు. దీంతో విద్యార్థులంతా ఉత్తీర్ణులవడమే కాకుండా మంచి మార్కులు సాధించగలుగుతున్నారు.