
పట్టాలకు సిఫారసు చేయాలి
లింగంపేట: భూభారతి చట్టం ప్రకారం భూ ముల వివరాలు సేకరించి ఎలాంటి సమస్యల కు తావులేకుండా ఉన్నట్లయితే పట్టాలకు సిఫారసు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ముంబోజీపేట, నల్లమడుగు గ్రామాలకు చెందిన రైతులు రెవెన్యూ సదస్సుల్లో ఽఇచ్చిన దరఖాస్తులను మంగళవా రం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మాట్లాడి సర్వే నంబర్లు, భూ విస్తీర్ణం, సా గు చేస్తున్న రైతుల సంఖ్య, ఎన్నేళ్ల నుంచి సాగు లో ఉన్నారు అన్న వివరాలను తెలుసుకున్నా రు. సదరు భూములు అటవీ ప్రాంతమా లేక పట్టా భూములా అని అటవీ శాఖ, రెవెన్యూ శా ఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం భవానీపేటలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోళ్ల వివరాలు, రైతులకు కల్పించిన వసతుల గురించి తెలుసుకున్నారు. ధాన్యం తూకాలను వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదన పు కలెక్టర్ విక్టర్, భూభారతి ప్రత్యేకాధికారి రా జేందర్ తదితరులు పాల్గొన్నారు.