
లక్ష్యం మేర మొక్కలు సిద్ధం
నిజాంసాగర్: ప్రతి పంచా యతీ పరిధిలో లక్ష్యం మేర మొక్కలను సిద్ధం చేస్తున్నామని ఈజీఎస్ ఏపీడీ వామన్‌రావు పేర్కొన్నారు. లక్ష్యంపై నిర్లక్ష్యం శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. మంగళవారం ఆయన ప్లాంటేషన్ మేనేజర్ సురేందర్‌తో కలిసి తెల్గాపూర్‌లోని వన నర్సరీని సందర్శించారు. వన నర్సరీలో 4 వేల మొక్కల పెంపకం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మొక్కల సంరక్షణను వన సేవకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు చూసుకోవాలని సూచించారు. వారి వెంట ఈజీఎస్ ఏపీవో శివకుమార్, టెక్నికల్ అసిస్టెంట్ బాల్‌సింగ్, పంచాయతీ కార్యదర్శి గంగారాం, ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ తదితరులు ఉన్నారు.

లక్ష్యం మేర మొక్కలు సిద్ధం