
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు
భిక్కనూరు: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. సోమవారం మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ప్రాణహిత చేవెళ్ల పథకం ద్వారా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 23 కోట్లను మంజూరు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో ఉన్న పలు సమస్యలను షబ్బీర్ అలీకి వివరించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ విభాగం ఉప అధ్యక్షులు కుంట లింగారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ స్వామి, వీడీసీ అధ్యక్షుడు కొండ సిద్దరాములు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ధర్మయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.