
నిరుపయోగంగా నీటి ట్యాంకులు
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో నిధులు లేవని నీటి ట్యాంకులను నిరుపయోగంగా వదిలేశారు. మండలంలోని బొప్పాస్ పల్లి గ్రామంలో గతంలో నర్సరీలో ఉపయోగించిన నీటి ట్యాంకును అలాగే వదిలేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీకి కొత్తది కొని వాడుతున్నారు. అంకోల్ తండాలో నీటి సమస్య తీర్చడానికి పంచాయతీ నిధులతో సింగిల్ ఫేజ్ మోటారు వద్ద ట్యాంకు ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల క్రితం దిమ్మో కూలి పోవడంతో నీటి ట్యాంకును అలాగే వదిలేశారు. ఉన్న వాటిని ఉపయోగించకుంటే నిధుల కొరత ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

నిరుపయోగంగా నీటి ట్యాంకులు

నిరుపయోగంగా నీటి ట్యాంకులు