
రైతన్న ఐడియా అదుర్స్
బీబీపేట: మండలంలోని జనగామ మర్రి వద్ద ప్రధాన రహదారిపై తండ్రీకొడుకులు తమ సొంత ఆలోచనలతో ఆరబోసిన వడ్లను వాహనం సహాయంతో ఎండబెట్టారు. నేర్పారు. కల్లాలు లేకపోవడంతో రోడ్లపైనే ఆరబోసిన ధాన్యాన్ని ద్విచక్ర వాహనానికి వెనుకాల ఒక చెక్కతో ఏర్పాటు చేసి తాడు సహయంతో వాహనాన్ని నడుపుతూ ధాన్యం ఆరబెట్టుతుండగా ఈ దృశ్యాన్ని శుక్రవారం ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
అక్రమంగా ఇసుక
తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని సిర్‌పూర్ శివారులో ఉన్న మంజీర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను శుక్రవారం పట్టుకున్నట్లు ఆర్‌ఐ సాయిబాబా తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో కలిసి ట్రాక్టర్‌ను మద్నూర్ పీఎస్‌కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
బోధన్ నుంచి హైదరాబాద్‌కు కొత్త బస్సు సర్వీసు
రుద్రూర్: ఎండకాలం ప్రయాణికుల సౌకర్యార్థం బోధన్ బస్టాండ్ నుంచి హైదరాబాద్‌కు రుద్రూర్, వర్ని, బాన్సువాడ, మెదక్ మీదుగా కొత్తగా హైటెక్ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ విశ్వనాథ్ తెలిపారు. బోధన్ బస్టాండ్ నుంచి రాత్రి పది గంటలకు బస్సు బయలు దేరుతుందని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రయాణికులు రాత్రి వేళ ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతున్నారని డిపో సిబ్బంది సీనియర్ కంట్రోలర్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో వెల్లడైందన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి హైటెక్ సర్వీస్‌ను ప్రారంభించామని అన్నారు.

రైతన్న ఐడియా అదుర్స్