కారులో నిద్రిస్తున్న వారిపై దాడి | - | Sakshi
Sakshi News home page

కారులో నిద్రిస్తున్న వారిపై దాడి

Apr 4 2025 1:59 AM | Updated on Apr 4 2025 1:59 AM

కారుల

కారులో నిద్రిస్తున్న వారిపై దాడి

కామారెడ్డి క్రైం: రోడ్డు పక్కన కారు నిలిపి విశ్రాంతి తీసు కుంటున్న వారిపై దుండగు లు దాడి చేసి దోపిడీకి పాల్పడిన ఘటన కామారెడ్డి మున్సి పల్‌ పరిధిలోని టేక్రియాల్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన వీరరాఘవయ్య కుమారుడు నాగమణిదీప్‌ హైదరాబాద్‌లో పదో తరగతి చదువుకుంటున్నాడు. పరీక్షలు పూర్తి కావడంతో వీరరాఘవయ్య కుమారుడిని స్వగ్రామానికి కారులో తీసుకొస్తున్నాడు. వీరి వెంట వీరరాఘవయ్య స్నేహితుడైన మరో వ్యక్తి కూడా ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో టేక్రియాల్‌ వద్ద పెట్రోల్‌ బంక్‌ పక్కనే ఉన్న ఓ హోటల్‌ ఎదుట రోడ్డు పక్కన కారు నిలిపి అందులో నిద్రించారు. ఇది గమనించిన నలుగురు దుండగులు కారు అద్దాలను పగలగొట్టి దాడి చేశారు. కారులోని ఓ బ్యాగు, ల్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో వీర రాఘవయ్యకు గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే భయంతో రాఘవయ్య కారు స్టార్ట్‌ చేసి దాదాపు ఆరు కిలో మీటర్ల దూరంలోని సదాశివనగర్‌ వరకు తీసుకెళ్లారు. అక్కడ కారును నిలిపి డయల్‌ 100 కు సమాచారం ఇచ్చాడు. ఎస్పీ రాజేశ్‌ చంద్ర, దేవునిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ల్యాప్‌టాప్‌, బ్యాగు అపహరణ

టేక్రియాల్‌లో రెచ్చిపోయిన దుండగులు

కారులో నిద్రిస్తున్న వారిపై దాడి 1
1/1

కారులో నిద్రిస్తున్న వారిపై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement