నిజాంసాగర్/బీబీపేట/లింగంపేట : మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామ వన నర్సరీని మండల ప్రత్యేక అధికారిణి అరుణ పరిశీలించారు. వన నర్సరీలో పెంచుతున్న మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలని ఈజీఎస్ సిబ్బందికి ఆమె సూచించారు. పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ సింగ్, ఫీల్డ్‌అసిస్టెంట్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులున్నారు.బీబీపేట మండలం జనగామ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ పరిశీలించారు.ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూలీలకు సూచించారు. అనంతరం బీబీపేటలో నర్సరీని పరిశీలించి మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు పట్టాలని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో పూర్ణచంద్రోదయ కుమార్, తదితరులున్నారు. లింగంపేట మండలం బోనాల్, బాయంపల్లి, కొర్పోల్, బాణాపూర్, నాగారం గ్రామాల శివారులో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో నరేష్ పరిశీలించారు. ఉపాధి పనులు కొలతల ప్రకారం చేయాలని సూచించారు. అనంతరం నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. నర్సరీలలోని మొక్కలకు ప్రతీ రోజు నీరు పట్టాలని సూచించారు. అలాగే సీసీ రోడ్డు, క్యాటిల్ షెడ్‌లను పరిశీలించారు. ఆయన వెంట క్షేత్రసహయకుడు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.