‘బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి’

Mar 26 2025 1:27 AM | Updated on Mar 26 2025 1:25 AM

కామారెడ్డి టౌన్‌ : బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా కోర్టు న్యాయమూర్తి టి.నాగరాణి తెలిపారు. సాధ న స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని సీనియర్‌ సిటిజన్స్‌ భవనంలో బాల్యవివాహాలపై వర్క్‌షాప్‌ ని ర్వహించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి మా ట్లాడుతూ బాల్య వివాహాలతో నష్టాలు, పి ల్లల అక్రమ రవాణా, పిల్లలపై వేధింపులు అంశాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు, చిన్నారుల సమస్యలపై హెల్ప్‌ లైన్‌ నంబర్ల(100, 1098, 181, 1930, 15100)కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యురా లు స్వర్ణలత, మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి, లైట్‌ ఫర్‌ బ్లైండ్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు మేదిని దేవి, సాధన సంస్థ కోఆర్డినేటర్లు గిరిజ, మమత పాల్గొన్నారు.

ఇన్‌చార్జి డీటీసీపీవోగా గిరిధర్‌

కామారెడ్డి టౌన్‌: డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ ఆండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) జిల్లా ఇన్‌చార్జి అధికారిగా కామారెడ్డి మున్సిపల్‌ టీపీవో గిరిధర్‌కు బాధ్యతలు అప్పగించారు. డీటీసీపీవోగా విధులు నిర్వహిస్తున్న సువర్ణదేవి ఈనెల 31 వరకు సెలవుపై వెళ్లడంతో కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

బల్దియాకు ముగ్గురు టీపీబీవోలు

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి మున్సిపాలిటీలో టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఆఫీసర్‌(టీపీబీవో)లుగా ముగ్గురు నియమితులయ్యారు. టీపీబీవోగా సాయికిరణ్‌ మంగళవారం విధుల్లో చేరారు. జె.మల్లికార్జున్‌, బి.వెంకట్‌ రెండు రోజుల్లో విధుల్లో చేరుతారని టీపీవో గిరిధర్‌ తెలిపారు.

నేడు హిందీ ఔర్‌

రోజ్‌గార్‌ వర్క్‌షాప్‌

కామారెడ్డి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బుధవారం ఉదయం 11 గంటలకు ‘హిందీ భాష ఔర్‌ రోజ్‌ గార్‌’ అనే అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌, హిందీ విభాగాధిపతి జి.శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వర్క్‌షాప్‌లో పాల్గొని హిందీతో ఉపాధి అవకాశాలను తెలుసుకోవాలని సూచించారు.

ఘనంగా గోటి

తలంబ్రాల దీక్ష

నిజామాబాద్‌ రూరల్‌: శ్రీరామనవమి రోజున కనులపండువగా జరిగే భద్రాచల రామయ్య కల్యాణానికి తెలంగాణ నుంచి 250 కిలోల గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్పంతో శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని కోటగల్లిలో ఉన్న జైర్‌కోట్‌ హనుమాన్‌ మందిరంలో మంగళవారం వంద మందికిపైగా భక్తులు రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఒలిచి సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజుకు అందజేశారు. మైసమ్మ, జైర్‌కోట్‌, మల్లికార్జున, విజయగణపతి భజన మండళ్ల ఆధ్వర్యంలో నాలుగు గంటలపాటు భజన కొనసాగింది. రామకోటి రామరాజును భక్తులు ఘనంగా సన్మానించారు. తాము భద్రాచలం వెళ్లలేకపోయినా.. తమ చేతులతో ఒలిచిన గోటి తలంబ్రాలు వెళ్లడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

విశ్రాంత ఉద్యోగులకు

బకాయిలు చెల్లించాలి

బాన్సువాడ: పట్టణంలో మంగళవారం ఆర్టీ సీ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్షులు కౌసర్‌ మాట్లాడుతూ ఆర్టీసీలో పని చేసి రిటైరయిన విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదన్నా రు. విశ్రాంత ఉద్యోగులకు వెంటనే బకాయి లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మహమూద్‌, పండరి, యేషయ్య, గంగారాం, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘బాల్య వివాహాల నిర్మూలనకు  కృషి చేయాలి’ 
1
1/1

‘బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement