సాహిత్యంలో రాణిస్తున్న చుక్కాపూర్‌వాసి | - | Sakshi
Sakshi News home page

సాహిత్యంలో రాణిస్తున్న చుక్కాపూర్‌వాసి

Mar 17 2025 11:05 AM | Updated on Mar 17 2025 10:59 AM

మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన కందాళ పద్మావతి వచన కవితలు, కథనాలు రాసి సాహితీరంగంలో రాణిస్తున్నారు. ఆమె రచించిన 55 కవితలతో కూడిన ‘హది స్వప్నం’ అనే పుస్తకాన్ని ఇటీవల హైదరాబాద్‌లోని త్యాగరాయ గాన సభలో ఆవిష్కరించారు. పద్మావతికి చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన వేల్పూరి నరసింహచారితో వివాహమైంది. పదో తరగతి నుంచే ఆమెకు చిన్న కవితలు రాయడం ప్రారంభించింది. పెళ్లయిన 20 ఏళ్లకు కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఇంటర్‌, డిగ్రీ, తెలుగు పండిట్‌ కోర్సు పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రచనపై దృష్టి సారించింది. సామాజిక స్పృహ, సమానత్వం, మహిళాభ్యుదయం భావాలతో కవితలు రాస్తుంది. ఆమె రాసిన కవితలకు పలు బహుమతులతో పాటు ఎన్నో అవార్డులు లభించాయి. స్వర్గీయ సినారె చేతుల మీదుగా పలు ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. పద్మావతి అందరి మన్ననలను పొందుతోంది.

డ్రెయినేజీ పాలవుతున్న సాగునీరు

నస్రుల్లాబాద్‌(బాన్సువాడ) : మండలంలోని నాచుపల్లి గ్రామంలో సాగు నీరు మురికి కా లువ పాలవుతుంది. పలు చోట్ల సాగు నీరు అందక పంట పొలాలు బీటలు వారుతున్నా యి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. అధికారులు స్పందించి వృథాగా పోతున్న నీటిని అరికట్టాలని రైతులు కోరుతున్నారు.

ఎమ్మార్పీఎస్‌ నిరసనలు

ఎల్లారెడ్డిరూరల్‌ : ఎస్సీ వర్గీకరణలో భాగంగా జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు అన్నారు. పట్టణంలోని తెలంగాణ తల్లి ప్రాంగణంలో నిర్వహిస్తున్న దీక్షలు ఆదివారంతో ఐదో రోజుకు చేరాయి. రిజర్వేషన్లు అమలు అనంతరం ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు పద్మారావు, శివానందం, సామెల్‌ తదితరులున్నారు.

ఎమ్మెల్యే సహకారంతో బోరు మోటారు

భిక్కనూరు: మండలంలోని తిప్పాపూర్‌ గ్రామంలోని నాలుగో వార్డులో ఎమ్మెల్యే కేవీఆర్‌ సహకారంతో నీటి ఎద్దడిని నివారించినట్లు బీజేవైఎం జిల్లాకార్యదర్శి పైడి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే నిధులతో బోరును తవ్వించి, మోటారు పంపును బిగింపజేశామన్నారు. ఆదివారం పూజ కార్యక్రమాలను నిర్వహించి బోరుమోటర్‌ను ప్రారంభించారు.

ఫిర్యాదు చేసినా

పట్టించుకోరా..?

కామారెడ్డి అర్బన్‌: పట్టణ పరిధిలోని కాకతీయనగర్‌ 35వ వార్డు రోడ్డు నంబర్‌ –8లో మురికికాలువను మట్టితో మూసివేశారు. దీంతో ఖా ళీ ప్లాట్లలోకి మురుగునీరు చేరి దోమలు వస్తున్నాయని, దుర్గంధం వ్యాపిస్తున్నట్టు గతనెల 22న మున్సిపల్‌లో కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు ఇసుక డంపుల వేలం

నిజాంసాగర్‌(జుక్కల్‌): మండలంలోని మర్‌పల్లి గ్రామంలో సీజ్‌ చేసిన ఇసుక డంపులకు సోమవారం వేలంపాట నిర్వహించనున్నట్లు తహసీల్దార్‌ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి సంబంధించిన వ్యక్తులు వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు.

సాహిత్యంలో రాణిస్తున్న చుక్కాపూర్‌వాసి 1
1/2

సాహిత్యంలో రాణిస్తున్న చుక్కాపూర్‌వాసి

సాహిత్యంలో రాణిస్తున్న చుక్కాపూర్‌వాసి 2
2/2

సాహిత్యంలో రాణిస్తున్న చుక్కాపూర్‌వాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement