ఖలీల్‌వాడి: నగరంలోని సుభాష్‌నగర్ ఎన్‌జీవో కాలనీలో గంజాయి అమ్ముతున్న ఓ యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై హరిబాబు శనివారం తెలిపారు. వివరాలు ఇలా.. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఎన్‌జీవో కాలనీకి వెళ్లారు. అక్కడ గంజాయి అమ్ముతున్న నిర్మల్ జిల్లా గాజుల నర్సాపూర్ గ్రామానికి చెందిన కోడె సంపత్‌ను పట్టుకున్నారు. అలాగే అతడి వద్ద నుంచి 230 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసు కున్నారు. గంజాయిని నాందేడ్ నుంచి తీసుకుని వచ్చి నిజామాబాద్‌లో అమ్ముతున్నట్లు అతడు తెలిపాడు. ఈమేరకు కేసు నమోదు చేశామన్నారు.