కామారెడ్డి అర్బన్: ప్రతి వ్యక్తి వినియోగదారుడేనని అదనపు కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. వారికి హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విషయంలో వినియోగదారుల చైతన్యమే ముఖ్యమన్నారు. వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా పౌ రసరఫరాల అధికారి మల్లికార్జునబాబు, పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ రాజేందర్, ఆర్డీవో మన్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.