బాయ్స్ హస్టల్లో బాలికకు చోటు | - | Sakshi
Sakshi News home page

బాయ్స్ హస్టల్లో బాలికకు చోటు

Jul 9 2024 2:16 AM | Updated on Jul 9 2024 10:07 AM

-

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ న్యూబాయ్స్‌ హాస్టల్‌ విద్యార్థిని క్రమశిక్షణ చర్య కింద వర్సిటీ ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. 15 రోజుల కింద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్సిటీ విద్యార్థులు తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి తెయూలో బోటనీ ఫైనలియర్‌ చదువుతూ క్యాంపస్‌లోని న్యూ బాయ్స్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. అతడితో కలిసి డిగ్రీ చదివిన స్నేహితురాలు సుమారు 15 రోజుల కిత్రం యూనివర్సిటీకి వచ్చింది. 

అప్పటికే రాత్రి కావడంతో ఆమెను తన గదిలోనే ఉంచాడు. మరుసటి రోజు ఉదయం హాస్టల్‌లో బాలిక ఉండటం గమనించిన విద్యార్థులు విషయాన్ని వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. ఈ విషయం బయటకు పొక్కడంతో రిజిస్ట్రార్‌ యాదగిరి చర్యలు తీసుకున్నారు. విద్యార్థిని హాస్టల్‌తో పాటు యూనివర్సిటీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు.

 ఈ విషయంలో హాస్టల్‌ సెక్యూరిటీ సిబ్బందితో పాటు వార్డెన్‌ నిర్లక్ష్యం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా సస్పెండ్‌కు గురైన సదరు విద్యార్థి నాలుగైదు రోజులుగా వర్సిటీ క్యాంపస్‌లోనే తిరుగుతున్నట్లు సమాచారం. తనను పరీక్షలు రాయనివ్వాలని బోటనీ విభాగాధిపతి, వర్సిటీ ఉన్నతాధికారులకు మొరపెట్టుకోగా తిరస్కరించినట్లు తెలిసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement