ప్రధాన కాలువలో ప్రవహిస్తున్న సాగర్ జలాలు
ఆయకట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంటల కోసం మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఐదో విడత నీటిని విడుదల చేపట్టారు. ప్రాజెక్టునుంచి ప్రధాన కాలువకు 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని నీటిపారుదలశాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. నీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. మంగళవారం సాయంత్రానికి 1,398.60 అడుగుల(9.915 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. – నిజాంసాగర్


