
మోర్తాడ్ (బాల్కొండ): ఇంటర్ మొదటి సంవత్సరం కామర్స్ పరీక్ష రాయడానికి వెళ్తూ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కమ్మర్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన గంధం గణేశ్(17) అతని స్నేహితుడు కృష్ణతో కలిసి మోర్తాడ్‌కు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. బద్దం వాడ క్రాస్ రోడ్డు వద్ద బైక్ చెట్లకు తగిలి అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయింది. కింద పడిన గణేశ్‌కు బలంగా గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతని స్నేహితునికి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యం రాజు తెలిపారు.