
మల్లయ్య(ఫైల్)
నాగిరెడ్డిపేట: మండలంలోని చిన్నఆత్మకూర్ గ్రామానికి చెందిన కొంపల్లి మల్లయ్య(49) ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మల్లయ్య కొంతకాలంగా తాగుడుకు బానిసై తిరుగుతుండేవాడు. ఆరునెలలుగా ఆయనకు మతిస్థిమితం సరిగ్గా లేదని కుటుంబసభ్యులు తెలిపారు. మల్లయ్య శనివారం సాయంత్రం జలాల్‌పూర్ శివారులో గల పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా వస్తున్నాని చెప్పి రాలేదు. కాగా ఆదివారం ఉదయం జలాల్‌పూర్ శివారులో గల చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్లయ్య ఆరోగ్య పరిస్థితి బాగాలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.