పిఠాపురం బైపాస్‌రోడ్డులో సీఎంసీ హాస్పిటల్ గోడ వెనుక ప్రాంతంలోని శ్మశాన వాటిక స్థలం స్థానిక జనసేన నాయకులు కబ్జా చేశారు. సుమారు 27 సెంట్ల స్థలం కబ్జాకు గురయ్యింది. స్థానిక అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో స్థానిక పాడా కార్యాలయంలోను, అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను. అయినా ఎవరూ పట్టించుకొనకపోవడంతో ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నాను.
– సూరవరపు దివాణం, పిఠాపురం
నా భూమి నిషేధ జాబితా
నుంచి తొలగించాలి
నాకు గాంధీనగర్‌లో 905 గజాల నివాస స్థలం ఉంది. నా తండ్రి ద్వారా అది సంక్రమించింది. అది ప్రస్తుతం ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో అనేకసార్లు అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఈ స్థలానికి సంబంధించిన అన్ని రికార్డులు నా దగ్గర ఉన్నాయి. నా స్థలం నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. వయసు రీత్యా తరచూ కలెక్టర్ కార్యాలయానికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.
– చల్లపల్లి గోవిందరావు,
42వ డివిజన్ గాంధీనగర్, కాకినాడ


