తుని: సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేయాల్సిన మీడియా రోత రాతలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తుని మండలం ఎస్.అన్నవరంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియాలో కీలకంగా వ్యవహరించే ఈనాడులో ప్రచురితమైన వార్తలు చూస్తే బాధ కలుగుతోందన్నారు. ఎవరి మెప్పు కోసం రోత రాతలు రాస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెండేళ్ల క్రితం అప్పట్లో తన వద్ద గన్‌మన్‌గా పని చేసిన వ్యక్తికి, తనకు మధ్య అసత్య ఆరోపణలు వండి వార్చడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ గన్‌మన్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్ద పని చేస్తున్న విషయాన్ని దాచి, తనపై విమర్శలు చేయడం ద్వారా పత్రికా విలువలను తుంగలో తొక్కిందని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఇబ్బంది కలిగే రీతిలో ఈనాడు వార్తలు రాస్తోందని మండిపడ్డారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో గన్‌మన్ వల్ల వచ్చిన ఆరోపణలపై స్పందించి, అతడిని ఎస్పీ ఆఫీసుకు సరెండర్ చేసిన విషయాన్ని రాజా గుర్తు చేశారు. తాజాగా మళ్లీ తప్పుడు కథనాలు రాస్తున్న ఈనాడుకు నైతికత లేదని, అధికార పార్టీ నాయకులు తప్పులు చేసినా వీరికి కనిపించకపోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో వేధిస్తున్నారని, పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, రోజంతా కూర్చోబెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులను టార్గెట్ చేయడం తగదన్నారు. ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదని, ఇప్పుడు చేస్తున్న దానికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు అనుభవించక తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల తనకు పదవి కావాలని ఎప్పుడూ అడగలేదని చిలక పలుకులు పలికారని, రాజ్యసభ సీటు కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని రాజా ప్రశ్నించారు.
ఫ వ్యక్తిత్వ హననానికి దిగజారిన ఈనాడు
ఫ ఎప్పుడో వెళ్లిన గన్‌మన్‌కు
లింకు పెట్టి తప్పుడు రాతలు
ఫ ప్రస్తుతం డిప్యూటీ సీఎం వద్ద
అతడి విధులు
ఫ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా


