పిఠాపురం: పట్టణంలోని పదో సచివాలయం శానిటేషన్ సెక్రటరీ గుమ్మడి సుధీర్‌పై ఫోనులో దుర్భాషలాడిన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మండిపడ్డారు. బాధిత దళిత ఉద్యోగి సుధీర్‌ను రాయడానికి వీలు లేని బూతులు తిట్టిన కమిషనర్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో సోమవారం హల్‌చల్ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విపర్తి నిఖిల్‌కృష్ణ ఆధ్వర్యాన సచివాలయ ఉద్యోగులు మంగళవారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి, నినాదాలు చేశారు. కమిషనర్‌ను బేషరతుగా విధుల నుంచి తొలగించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మహిళలను సైతం కమిషనర్ కనకారావు దుర్భాషలాడుతున్నారని, ఆయన ఉంటే విధులు నిర్వహించలేమని పలువురు మహిళా సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. థర్డ్ జెండర్‌ను పిలిచే బృహన్నల అనే పదంతో మహిళా ఉద్యోగుల్ని కమిషనర్ దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు
బాధిత ఉద్యోగి సుధీర్ మాట్లాడుతూ కింది స్థాయి ఉద్యోగులను కమిషనర్ పురుగుల కంటే హీనంగా చూస్తూంటారని ఆరోపించారు. ఇప్పటికే చాలా మంది చిరుద్యోగులపై బూతులతో విరుచుకుపడ్డారని, బదిలీపై వచ్చినప్పటి నుంచీ తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తనను దుర్భాషలాడటంతో పాటు తన తల్లిని కించపరిచేలా తిట్టడం మానసిక వేదనకు గురి చేసిందన్నారు. వృత్తికి సంబంధం లేకుండా తనను వ్యక్తిగతంగా దూషించిన కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సస్పెండ్ చేసి, చర్యలు తీసుకోవాలి
అసోసియేషన్ రాష్ట్ర నేత విప్పర్తి నిఖిల్‌కృష్ణ, ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ దారపురెడ్డి తాతాజీరావు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ కింది సిబ్బంది సరిగ్గా పని చేయకపోతే పై అధికారిగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప, ఇలా వ్యక్తిగత దూషణలకు పాల్పడటమేమిటని ప్రశ్నించారు. కమిషనర్ తీరును తీవ్రంగా ఖండించారు. కనకరావును వెంటనే సస్పెండ్ చేసి, శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఉద్యోగులు, అక్కడున్న అంబేడ్కర్, గాంధీజీ విగ్రహాలకు వినతిపత్రం అందజేశారు. ఆందోళన నిర్వహిస్తున్న క్రమంలో మహిళా ఉద్యోగి నాగమణి భావోద్వేగానికి గురై స్పృహ తప్పి పడిపోయారు. అనంతరం, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయానికి ప్రదర్శగా చేరుకుని, పీడీ ఎన్‌వీ శివరామ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని వారికి ఆయన హామీ ఇచ్చారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడైన శానిటేషన్ సెక్రటరీ సుధీర్ మున్సిపల్ కమిషనర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.జాన్ క్రిష్టఫర్, ఉపాధ్యక్షుడు పి.కన్నారావు, పిఠాపురం మున్సిపాలిటీ అధ్యక్షుడు బి.రాఘవులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.రాంబాబు, ఉపాధ్యక్షులు వి.సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శి ఏవీడీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
·˘ í³u>ç³#Æý‡… Ð]l¬°Þç³ÌŒæ M>Æ>ÅÌSĶæ$… Ð]l§ýlª E§øÅVýS$ÌS B…§øâýæ¯]l
·˘ MýS¯]lM>Æ>Ð]l# º*™èl$ ç³#Æ>׿…Oò³ «§ýlÓf…
·˘ ´ëyé ï³yîlMîS ѯ]l†ç³{™èl…
·˘ ´ùÎçÜ$ÌSMýS$ »ê«¨™èl E§øÅW íœÆ>ŧýl$


