‘అమ్మచెక్కిన బొమ్మ’కు ప్రథమ బహుమతి | - | Sakshi
Sakshi News home page

‘అమ్మచెక్కిన బొమ్మ’కు ప్రథమ బహుమతి

Apr 1 2026 7:48 AM | Updated on Apr 1 2026 7:48 AM

ఏలేశ్వరం: శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా గొల్లపల్లి చెల్లయ్య మోమోరియల్‌ నాటక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. కళాపరిషత్‌ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు ఆసక్తికరంగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన గోవాడ క్రియేషన్స్‌ వారి అమ్మచెక్కిన బొమ్మ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. గోవాడ వెంకట్‌ దర్శకత్వం వహించగా, జ్యోతిరాజ్‌ భీశెట్టి రచన అందించారు. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్‌ వారి ఇంద్రప్రస్థం, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా గుంటూరు కరణం మహేష్‌ మోమోరియల్‌ తరమెల్లిపోతున్నదో ఎంపిక చేసి, నగదు పురస్కారాలు అందజేశారు. ఉత్తమ నటుడిగా సురభి నిఖిలేష్‌ (అమ్మచెక్కిన బొమ్మ), ఉత్తమ నటిగా జీఎన్‌డీ కుశమసాయి (ఇంద్రప్రస్థం), ఉత్తమ దర్శకుడుగా ఎన్‌.రవీంద్రరెడ్డి(ఇంద్రప్రస్థం) ఎంపికయ్యారు. కళాపరిషత్‌ అఽధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement