● కష్టబడి చదువుతూ.. | - | Sakshi
Sakshi News home page

● కష్టబడి చదువుతూ..

Apr 1 2026 7:48 AM | Updated on Apr 1 2026 7:48 AM

చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బీరువాలు మోస్తున్న విద్యార్థులు

విద్యార్థులకు చదువు చెప్పి, ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే వారి చేత పనులు చేయిస్తున్న సంఘటన చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఆలస్యంగా మంగళవారం వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళితే.. సుమారు వారం రోజుల క్రితం పాఠశాలకు నూతన ఫర్నిచర్‌ వచ్చింది. బరువైన బీరువాలు, ఇతర సామగ్రి ఉన్న ఆ ఫర్నిచర్‌ను విద్యార్థులు ఆపసోపాలు పడుతూ మోశారు. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో చూసిన పలువురు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఎంఈఓలు ఉన్నా పాఠశాలల పర్యవేక్షణ కనిపించడం లేదని విమర్శలున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

– చాగల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement