సమాచార శాఖ డీడీగా తిమ్మప్ప | - | Sakshi
Sakshi News home page

సమాచార శాఖ డీడీగా తిమ్మప్ప

Mar 31 2026 7:44 AM | Updated on Mar 31 2026 7:44 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులైన తిమ్మప్ప సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ను, జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

బాలబాలాజీ స్వామికి ‘లక్ష్మీ’కటాక్షం

మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 68 రోజులకు స్వామి వారికి ద్వారా రూ.56.08 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. 17 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండిని భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించారన్నారు. అమలాపురం గ్రూపు టెంపుల్స్‌ కార్యనిర్వహణాధికారి ఆర్‌.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో జరిగిన హుండీ లెక్కింపులో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి లక్ష్మీనారాయణ, స్థానికులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement