ప్రతి ప్రైవేటు విద్యా సంస్థా ప్రభుత్వ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలి. విద్యార్థులకు పాఠశాలల్లో క్రీడా మైదానంతో పాటు అన్ని వసతులూ పక్కాగా ఉండాలి. లేకుంటే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తాం. అలాగే, విద్యా సంస్థ పక్కా రిజిస్ట్రేషన్‌తో పాటు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలి. ఆకట్టుకునేలా ప్రైవేటు సంస్థలు చేసే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా గుర్తింపు పొందిన పాఠశాలల వివరాలు తెలియజేస్తాం.
– పిల్లి రమేష్, జిల్లా విద్యా శాఖాధికారి, కాకినాడ


