నిగ్గు తేలినా.. సిగ్గు వీడరా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సాక్షాత్తూ సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోర్టుకు నివేదిక ఇచ్చినప్పటికీ.. ఈ అంశంపై క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు అండ్ కో తీరును ప్రజలు పెద్ద ఎత్తున నిరసించారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా చేస్తున్న తప్పుడు రాజకీయాలను ఇకనైనా కట్టిపెట్టాలని.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంతో క్షుద్ర రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అండ్ కోకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ.. జిల్లావ్యాప్తంగా వివిధ ఆలయాల్లో శనివారం పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది.
అన్నవరంలో..
వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యాన అన్నవరం దేవస్థానంలో రత్నగిరి తొలి పావంచా వద్ద కొబ్బరి కాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెట్ల దారిలో కొండ పైకి వెళ్లి సత్యదేవుని దర్శించుకున్నారు. బాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ స్వామివారిని వేడుకున్నారు. జెడ్పీటీసీ లక్ష్మణమూర్తి (దివాణం), పార్టీ ముఖ్య నేతలు వాసిరెడ్డి జమీలు, శెట్టిబత్తుల కుమార్‌రాజా, బెహరా దొరబాబు, దళే చిట్టిబాబు తదితరులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిపారంటూ దుర్మార్గంగా ఆరోపించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇప్పటికై నా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేకనే ఈ ఆరోపణలు చేశారన్నారు. వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా, తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ పార్టీ నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు ప్రత్తిపాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
·˘ †Æý‡$Ð]l$ÌS ÌSyýl*zÌZ
జంతువుల కొవ్వు కలవలేదని
సీబీఐ నిర్ధారణ
·˘ AƇ$$¯]lç³µsìæMîS ™èl糚yýl$ {ç³^éÆ>Ìê?
·˘ MýSÍĶæ¬VýS O§ðlÐ]l…™ø Æ>fMîSĶæ*Ìê?
·˘ OÐðlGÝëÞÆŠ‡ ïÜï³ {Ôóæ×æ$ÌS B{VýSçßæ…
·˘ hÌêÏÐéÅç³¢…V> ´ëç³ {糄>âýæ¯]l ç³NfË$
·˘ »êº$MýS$ Ð]l$…_ º$¨®
ప్రసాదించాలని ప్రార్థనలు
నిగ్గు తేలినా.. సిగ్గు వీడరా?


