రత్నగిరిపై ఆధ్యాత్మిక క్రతువులు | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై ఆధ్యాత్మిక క్రతువులు

Feb 1 2026 3:13 AM | Updated on Feb 1 2026 3:13 AM

రత్నగిరిపై ఆధ్యాత్మిక క్రతువులు

రత్నగిరిపై ఆధ్యాత్మిక క్రతువులు

అన్నవరం: రెండు ప్రధాన ఆధ్యాత్మిక క్రతువులకు రత్నగిరి వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 6 నుంచి కోటి తులసి పూజ, 20వ తేదీ నుంచి వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం ఖడ్గమాల పూజ ప్రారంభిస్తున్నారు. అన్నవరం దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వి.త్రినాథరావు శనివారం ఈ వివరాలు తెలిపారు.

కోటి తులసి పూజ ఇలా..

పాడిపంటల అభివృద్ధి, అన్న, ద్రవ్య, ధన సమృద్ధి, పుత్రపౌత్రాభివృద్ధి, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ దేవస్థానం వైదిక కమిటీ సూచనల మేరకు కోటి తులసి పూజ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 15వ తేదీ వరకూ పది రోజుల పాటు సత్యదేవుని సన్నిధిలో ఈ క్రతువు జరుగుతుంది. 15వ తేదీ ఉదయం 8 గంటలకు రుద్రహోమంతో ఈ పూజలు ముగుస్తాయి. ఈ సందర్భంగా రుత్వికులు ప్రతి రోజూ 40 బస్తాల తులసి పత్రితో పూజ నిర్వహిస్తారు. రోజుకు 10 లక్షల తులసి దళాలతో జరిగే ఈ పూజకు ఒక రోజుకు రూ.50 వేలు ఖర్చవుతుంది. ఒక రోజు ఖర్చు చెల్లించిన భక్తులకు గోత్రనామాలతో పది రోజులు పూజ చేస్తారు. ఈ పది రోజుల్లో వారికి నచ్చిన రోజున దాతలు పూజలో పాల్గొనవచ్చు. వారికి స్వామివారి ఫొటో, కండువా, రవికల వస్త్రం, ప్రసాదంతో పాటు, అక్షతలు, కుంకుమ, వేదపండితుల ఆశీర్వచనం అందిస్తారు. రూ.1,500 చెల్లించిన భక్తుల గోత్రనామాలతో ఒక రోజు పూజ చేస్తారు. వారికి స్వామివారి కండువా, రవికుల వస్త్రం, ప్రసాదం, అక్షతలు, కుంకుమ అందజేస్తారు. పూజకు అవసరమైన తులసి పత్రిని కూడా దాతలు సమర్పించవచ్చు.

ప్రతి శుక్రవారం ఖడ్గమాల పూజ

వనదుర్గ అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఖడ్గమాల పూజను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తరువాత ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకూ ఈ పూజ నిర్వహిస్తారు. రూ.1,116 టికెట్టుతో దంపతులు ఈ పూజలో పాల్గొనవచ్చు. పూజా ద్రవ్యాలను దేవస్థానమే సమకూరుస్తుంది. భక్తులు కొబ్బరికాయ, అరటిపండ్లు మాత్రం తీసుకుని రావాలి. పూజ అనంతరం అమ్మవారి రూపు, ప్రసాదంగా 250 గ్రాముల పులిహోర, కండువా, రవికల వస్త్రం, వేదాశీర్వచనం అందజేస్తారు.

·˘ 6 ¯]l$…_ Møsìæ ™èl$ÌSíÜ ç³Nf

·˘ ÆøkMýS$ 10 ÌS„ýSÌS ™èl$ÌSíÜ

దళాలతో సత్యదేవునికి త్రికాలార్చన

·˘ 15¯]l Æý‡${§ýlçßZÐ]l$…™ø Ð]l¬W…ç³#

·˘ 20¯]l Ð]l¯]l§ýl$Æý‡Y BÌSĶæ$…ÌZ

ఖడ్గమాల పూజకు శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement