పిఠాపురంలో..
పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ పీఏసీ సభ్యురాలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ వంగా గీత ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వేంకటేశ్వరస్వామి వారిని రాజకీయాలకు ఉపయోగించుకోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ తయారీలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని దర్యాప్తు సంస్థలు పదేపదే చెబుతున్నా, ఇప్పటికీ తప్పుడు ప్రచారంతో రాజకీయాలు నెరపడం దుర్మార్గమని మండిపడ్డారు. జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు, పార్టీ నేతలు గండేపల్లి బాబీ, కొప్పన శివనాథ్, జ్యోతుల బాబులు, ఆనాల సుదర్శన్, బత్తిన సాయి తదితరులు పూజలు నిర్వహించారు.


