పొదల్లో మగ శిశువు
చింతూరు: మండలంలోని కల్లేరులో పొదల మాటున శుక్రవారం మగ శిశువు కనిపించింది. సీలేరు వంతెన సమీపంలోని పొదల మాటున శిశువు ఏడుపు విన్న స్థానికులు ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో సీడీపీఓ జయలక్ష్మి సిబ్బందితో కలసి ఆ ప్రాంతానికి చేరుకుని పొదల్లో ఉన్న ఆ శిశువును బయటకు తీసి చికిత్స నిమిత్తం చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్, ఎస్‌ఐ రమేష్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కాగా మూడ్రోజుల క్రితం కూడా మదుగూరు ప్రాంతంలో నవజాత శిశువు లభ్యంకాగా, తాజాగా మరో పసికందు కనిపించడం గమనార్హం.


