దిగుబడిన కష్టాలు | - | Sakshi
Sakshi News home page

దిగుబడిన కష్టాలు

Jan 24 2026 7:25 AM | Updated on Jan 24 2026 7:25 AM

దిగుబ

దిగుబడిన కష్టాలు

జిల్లాలో మిర్చి తోటలపై ‘నల్లి’ తెగులు

దిగుబడులపై తీవ్ర ప్రభావం

నష్టాల ఊబిలో రైతన్నలు

క్వింటా రూ.21 వేలు దాటినా దిగాలే

ఏటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం

ఎటపాక: ఎర్ర బంగారమైన మిర్చికి ‘ధర’హారం వచ్చింది.. అంచనాలకు మించి రేటు పెరిగింది.. అయితే, ప్రస్తుతం ఈ సాగులో నల్లి తెగులు దిగుబడులపై ప్రభావం చూపుతోంది.. ఫలితంగా ధర బాగున్నా రైతులకు కష్టమే మిగులుతోంది.. ఐదేళ్ల నుంచి అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటూ మిర్చి తోటలు సాగు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఎంతో ఆశతో సాగు చేస్తున్న వాణిజ్య పంట మిర్చి ఈ ఏడాదీ కంటనీరు పెట్టించింది. పోలవరం జిల్లాలో ప్రధానంగా చింతూరు, వీఆర్‌ పురం, కూనవరం, ఎటపాక మండలాలు, పోలవరం ప్రాజెక్టు ముంపు భూములతో సహా సుమారు 6 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. అయితే, ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం 2,300 ఎకరాల్లో మిర్చి సాగు జరుగుతోంది. ఐదేళ్ల కిందట సుమారు 10 వేల ఎకరాల్లో సాగు చేసేవారు. రాను రాను సగం వరకూ విస్తీర్ణం తగ్గిపోయింది. నల్లి ప్రభావంతో ఈ ఏడాది కూడా మిర్చి దిగుబడులు తగ్గుతున్నాయి. ఎకరా మిర్చి సాగుకు రూ.1.20 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. అయితే, ప్రస్తుతం ఎర్ర, నల్ల నల్లి తెగుళ్లు మిర్చి తోటలను ఆశించాయి. వీటి ప్రభావం నుంచి పంటను కాపాడుకునేందుకు ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని రైతులు అంటున్నారు. ఈ తెగులు కారణంగా మిర్చి పూత, పిందె, ఆకుల్లోని రసాన్ని పీల్చివేయడంతో తోటలు నల్లగా మాడిపోతున్నాయి. ఈ ఏడాది సుమారు నెల రోజులు ఆలస్యంగా నల్లి ప్రభావం కనపడటంతో ముందుగా వచ్చిన పంటే కొందరు రైతులకు చేతికి అందింది. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ తెగులు కారణంగా కేవలం పది క్వింటాళ్ల లోపు మాత్రమే దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. గోదావరికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వరదల ఉధృతి అధికంగా ఉండడంతో ఈసారి మిర్చి సాగు ఆలస్యమైంది.

ఎక్కడెక్కడ.. ఎంతెంత

చింతూరు మండలం ఏజీ కోడేరు, ముకునూరు, కల్లేరు, చూటూరు, కూటూరు, ఈడిపల్లి; ఎటపాక మండలం నందిగామ, మురుమూరు, గౌరిదేవిపేట, గన్నవరం, నెల్లిపాక, తోటపల్లి, పిచుకలపాడు, రాయనపేట, గన్నవరం పరిసరాల్లో మిర్చి సాగు అధికంగా ఉంది. వీఆర్‌ పురం, కూనవరం మండలాల్లో సాగు తక్కువగా చేస్తున్నారు. ఎటపాక మండలంలోనే అధికంగా 60 శాతం సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. నల్లి తెగులు ప్రభావంతో మిర్చి సాగు విస్తీర్ణం ప్రతి ఏడాది తగ్గిపోతుంది. దిగుబడులు తగ్గడంతో పంటలు వేయడానికి రైతులు వెనకాడుతున్నారు.

దిగుబడిన కష్టాలు1
1/1

దిగుబడిన కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement