ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
కాకినాడ లీగల్: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, అనవసర విషయాల్లోకి వెళ్లడం వలన మీకు, మీ కుటుంబ సభ్యులకు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ (సీనియర్ సివిల్ జడ్జి) ఎన్.శ్రీలక్ష్మి బుధవారం తెలిపారు. స్థానిక స్పెషల్ సబ్‌జైలులో రికార్డులు, వంటగది, స్టోర్‌రూమ్ వంటి వాటిని తనిఖీ చేశారు. రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, వసతులు, భోజనం ఎలా ఉందని, ఎన్ని రోజుల నుంచి జైలులో ఉన్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సబ్‌జైలులో ఖైదీల కోసం ఉన్న ఫిర్యాదు బాక్స్ పరిశీలించారు. ఆ బాక్స్‌లో బూజుతో పాటు బల్లులు ఉండడం గమనించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఎవరికై నా న్యాయవాదులను పెట్టుకునే స్తోమత లేకపోతే తమ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సబ్ జైలు సూపరింటెండెంట్ ఎం.వీరబాబు, సబ్ జైలు డిప్యూటీ జైలర్ జోసఫ్, న్యాయవాదులు పాల్గొన్నారు.


