దైవ కుమారునికి స్వాగత సంరంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. ప్రేమ వెలుగులు ప్రసరింపజేసేందుకు.. పీడిత ప్రజలపై కరుణావర్షం కురిపించేందుకు.. సమస్త మానవాళి పాపాలను ప్రక్షాళన చేసేందుకు.. డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి.. కన్య మరియ గర్భాన.. దైవ కుమారుడైన క్రీస్తు జనియించిన శుభ సందర్భం క్రిస్మస్. ఆ బాల ఏసు రాకను స్వాగతిస్తూ ఈ నెల 25న ఈ పండగను ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేందుకు జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు సిద్ధమవుతున్నారు.
నింగి వీధుల నుంచి ప్రభువు జాడను చూపిన నక్షత్రాన్ని తలపించేలా.. ఇళ్లు, వీధుల్లో ఇప్పటికే క్రిస్మస్ స్టార్లు ఏర్పాటు చేసుకున్నారు. చర్చిలను విద్యుద్దీప తోరణాలతో అందంగా అలంకరించారు. కాకినాడ రామారావుపేట లూథరన్, హౌస్ ఆఫ్ ప్రేయర్, రిజర్వ్ లైన్ బాప్టిస్టు, చర్చి స్క్వేర్ సెంటర్‌లోని ఆంధ్రా బాప్టిస్టు, సీఎస్‌ఐ, రోమన్ కేథలిక్, పిఠాపురం, తుని పట్టణాల్లోని సెంటినరీ బాప్టిస్టు, పెద్దాపురం లూథరన్ తదితర చర్చిలను విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోతున్నాయి.
ఏసు ప్రభువు జననాన్ని కళ్లకు కట్టేలా.. నక్షత్రాలు, పశువుల పాకల సెట్టింగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నిత్య జీవానికి సూచికగా క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో, ప్రార్థనా మందిరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. చర్చిలతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ, మత ప్రబోధకులు క్రిస్మస్ దివ్య సందేశాన్ని అందిస్తున్నారు. చిల్డ్రన్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, వుమెన్ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు.
జోరుగా అమ్మకాలు
క్రిస్మస్ పండగ నేపథ్యంలో సంబంధిత సామగ్రి అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఫ్యాన్సీ షాపులు, గిఫ్ట్ షాపుల్లో గ్రీటింగ్ కార్డులు, క్రిస్మస్ స్టార్లు, క్రిస్మస్ ట్రీలు, వాటి అలంకరణ వస్తువులు, విద్యుద్దీపాల అమ్మకాలు పెరిగాయి. ఒక్కో ట్రీ రూ.350 నుంచి రూ.10 వేల వరకూ, ట్రీ అలంకరణ వస్తువులను రూ.20 నుంచి రూ.500 వరకూ, విద్యుద్దీపాలను రూ.35 నుంచి రూ.600 వరకూ విక్రయిస్తున్నారు.
విద్యుద్దీపాలంకరణలో
కాకినాడ జగన్నాథపురంలోని
సెంటినరీ బాప్టిస్టు చర్చి
ఫ క్రిస్మస్ వేడుకలకు
ప్రార్థనాలయాల ముస్తాబు
ఫ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు
దైవ కుమారునికి స్వాగత సంరంభం
దైవ కుమారునికి స్వాగత సంరంభం
దైవ కుమారునికి స్వాగత సంరంభం


