కొలంబో క్రికెట్ టోర్నీకి కాకినాడ లాయర్లు
కాకినాడ లీగల్: శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ నెల 20 నుంచి జనవరి 2 వరకూ జరిగే 37వ ఆలిండియా అడ్వొకేట్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో రాష్ట్ర జట్టు తరఫున ఆడటానికి కాకినాడ న్యాయవాదులకు అవకాశం వచ్చింది. ఈ టోర్నీలో కాకినాడ బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు ఎన్.భూచక్రవర్తి, కె.సందీప్ క్రికెట్ ఆడటానికి ఎంపికయ్యారు. టోర్నమెంట్ మేనేజర్‌గా జోకా వీఎస్ విజయకుమార్‌ను నియమించారు. వారిని బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఏలూరి సుబ్రహ్మణ్యం, వీరభద్రరావు, న్యాయవాదులు అభినందించారు.
ఎన్.భూచక్రవర్తి
కె.సందీప్
జె. విజయకుమార్
కొలంబో క్రికెట్ టోర్నీకి కాకినాడ లాయర్లు
కొలంబో క్రికెట్ టోర్నీకి కాకినాడ లాయర్లు


