కోటిగళ గర్జన | - | Sakshi
Sakshi News home page

కోటిగళ గర్జన

Dec 16 2025 4:37 AM | Updated on Dec 16 2025 4:37 AM

కోటిగ

కోటిగళ గర్జన

స్వచ్ఛందంగా పాల్గొన్నారు

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగన్‌మోహన్‌రెడ్డి ఏ ఉద్యమానికి పిలుపునిచ్చినా ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన 4 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచే చంద్రబాబు ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుంది.

– ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి,

కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే

జగన్‌కు పేరు వస్తుందనే దుగ్ధతో..

దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. ఇవి పూర్తయితే ప్రజల్లో ఆయనకు మంచి పేరు వస్తుందనే దుగ్ధతోనే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్ని మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టింది.

– తోట నరసింహం, మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌

కోట్లాది మంది గుండె చప్పుడు

సామాన్య విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు వైఎస్‌ జగన్‌ కష్టపడి మెడికల్‌ కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు సర్కారు ఓర్వలేకపోతోంది. ప్రజలు చేసిన సంతకాలే ప్రభుత్వ కుట్రపై వ్యతిరేకతకు నిదర్శనం. కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌ పరిగణనలోకి తీసుకుని, మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ జీఓను రద్దు చేయాలి.

– వంగా గీత, మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

‘తూర్పు’ నుంచే మార్పు

అప్పనంగా అమ్మేయడానికి రాష్ట్ర ఆస్తులు మీ అత్తగారి ఇంటి నుంచి తెచ్చిన పప్పు బెల్లాలు కావు. ప్రభుత్వ ఆస్తులు ప్రజలవి. వీటిని అమ్మేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజలను తాకట్టు పెట్టి, మితిమీరి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబు నిండా ముంచుతున్నారు. మెడికల్‌ కాలేజీల విషయంలో ఎవరు టెండర్‌ వేసినా, వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసి, కాలేజీలను స్వాధీనం చేసుకుంటుందని జగన్‌ ఇప్పటికే హెచ్చరించారు.

– కురసాల కన్నబాబు, వైఎస్సార్‌ సీపీ

ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్‌ కో ఆర్డినేటర్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ: సాగరతీర నగరం కాకినాడ జనసంద్రమైంది. ఎటు చూసినా జనమే జనం అన్నట్టుగా హోరెత్తిపోయింది. మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా.. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు.. ఆ పార్టీ శ్రేణులు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత 40 రోజులుగా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ప్రజల నుంచి 4 లక్షలకు పైగా సంతకాలు సేకరించారు. ఆయా నియోజకవర్గాలో సేకరించిన సంతకాల ప్రతులను ఇటీవల కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఆ ప్రతులను తాడేల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయానికి ప్రత్యేక వాహనాల్లో పంపించే కార్యక్రమం కాకినాడలో సోమవారం అట్టహాసంగా జరిగింది. ఎటు చూసినా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో కాకినాడ నగరమంతటా సందడే కనిపించింది. ఈ ఉద్యమంపై జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ కో ఆర్డినేటర్లు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫలితంగా ఈ కార్యక్రమం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. తూర్పున తుని నుంచి మొదలై ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట మీదుగా కాకినాడ రూరల్‌ నుంచి కాకినాడ సిటీ నియోజకవర్గం వరకూ దాదాపు అన్ని ప్రాంతాలూ జనసునామీని తలపించాయి.

కిక్కిరిసిన నగరం

జిల్లా నలుమూలల నుంచీ పార్టీ శ్రేణులు, నేతలు మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ భానుగుడి సెంటర్‌కు చేరుకున్నారు. అప్పటికే కాకినాడ సిటీ నలుమూలల నుంచి తరలివచ్చిన జనసందోహంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. కొద్దిసేపటికి తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, జగ్గంపేట నియోజకవర్గాల నుంచి ఆయా కో ఆర్డినేటర్ల ఆధ్వర్యాన పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చారు. దీంతో, భానుగుడి సెంటర్‌ ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. కాకినాడ – పిఠాపురం రహదారిలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. భానుగుడి సెంటర్‌ నుంచి వేలాది జనంతో పార్టీ నేతలు కాలి నడకన ర్యాలీ ప్రారంభించారు. ఇది పండగ వాతారణం మధ్య ఆద్యంతం అట్టహాసంగా సాగింది. తీన్‌మార్‌ నృత్యాలు, ఉరకలెత్తిన ఉత్సాహంతో కార్యకర్తలు చేసిన డ్యాన్సులతో సంబరం అంబరాన్ని అంటిన వాతావరణం కనిపించింది.

జనం.. బ్రహ్మరథం

భానుగుడి సెంటర్‌ మొదలుకొని ఆనంద్‌ థియేటర్‌, టూ టౌన్‌ ఫ్లై ఓవర్‌, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, జెమినీ ప్లాజా సెంటర్‌, సూపర్‌ బజార్‌ కాంప్లెక్స్‌, బాలాజీ చెరువు సెంటర్‌ వరకూ ప్రతిచోటా ఈ ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి సెంటర్‌లోనూ బాణసంచా కాల్చి, మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎదురొచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ర్యాలీకి ముందు వరుసలో సుమారు 3 వేల మంది పార్టీ కార్యకర్తలు జెండాలు చేబూని నిర్వహించిన బైక్‌ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెయిన్‌ రోడ్డు పొడవునా షాపుల్లో పనిచేసే వారు ఉత్సాహంగా బయటకు వచ్చి ర్యాలీకి మద్దతు ప్రకటించారు. భానుగుడి సెంటర్‌ నుంచి బాలాజీ చెరువు సెంటర్‌ వరకూ 5 కిలోమీటర్ల మేర ర్యాలీ పూర్తవడానికి సుమారు 2.30 గంటల సమయం పట్టింది. జనం తండోపతండాలుగా తరలిరావడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. ర్యాలీ అనంతరం బాలాజీచెరువు సెంటర్‌లో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి తోట నరసింహం ప్రసంగించారు.

దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటరీ పరిశీలకుడు డి.సూర్యనారాయణరాజు, కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీశివకుమారి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వాసిరెడ్డి జమీలు, కొప్పన శివ, ఒమ్మి రఘురామ్‌, నెక్కంటి సాయి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్‌, పార్టీ మహిళ, యువజన, బీసీ విభాగాల అధ్యక్షులు వర్ధినీడి సుజాత, రాగిరెడ్డి బన్నీ, అల్లి రాజబాబు, ఆవాల లక్ష్మీనారాయణ, పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమం విజయవంతం

ఏ పనయినా ప్రజల సహకారం లేకపోతే విజయవంతం కాదు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలో అక్టోబర్‌ 15న చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 4.20 లక్షల మంది స్వచ్ఛందంగా సంతకాలు చేసి, ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ఇదంతా బోగస్‌ అని టీడీపీ వారు అంటున్నారు. వారికి ఈ సంతకాలను డిజిటల్‌గా పంపిస్తాను. ఒకసారి చెక్‌ చేసుకుని, ప్రజల మనసులు కనుక్కోండి. నిజమైతే మీ నిర్ణయం ఆపుతారా? కచ్చితంగా అన్నీ మీ వద్దకు చేరతాయి. ర్యాండమ్‌గా పరిశీలించండి. ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ చేయించడం మీకు కొత్త కాదు. నిన్న, మొన్న, ఎన్నికల ముందు రకరకాల పుకార్లు షికార్లు చేయించి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన తీరు ప్రజలందరికీ అర్థమైంది. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశంతో ఈ రాష్ట్రానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 4 మెడికల్‌ కళాశాలలు తెస్తే, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 17 వైద్య కళాశాలు తీసుకొచ్చారు. మీరు ఒక్క కాలేజీ అయినా తెచ్చారా? ఒక మెడికల్‌ కాలేజీ పర్మిషన్‌కే రూ.500 కోట్లు అవుతుంది. అలాంటిది భూమి, భవనాలు, మొత్తం మౌలిక వసతులన్నీ కలిపి రూ.వెయ్యి కోట్లు అయ్యింది. అలాంటిది ఒక్కో కాలేజీని రూ.5 వేలకు చంద్రబాబు మనుషులకు ఇచ్చేసుకుంటున్నారు. ప్రజవద్దంటున్నప్పటికీ ఎక్కడా ఆగడం లేదు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు ప్రజలందరూ ఆమోదం తెలుపుతున్నట్లు వాళ్ల పత్రికలో రాశారు. ప్రజల మనస్సులను రీ రైట్‌ చేస్తూ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్‌ 4 పోర్టులు, 8 హార్బర్లు కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు వచ్చినచోట్ల భూముల రేట్లు పెరిగాయి. తుని నియోజకవర్గానికి జగన్‌ ఓ పోర్టు తీసుకొచ్చారు. ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఎకరం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లు పలుకుతోంది. ఇప్పుడు చంద్రబాబు దృష్టి ఆ భూములపై పడింది. పీపీపీ మోడ్‌లో భూములు సేకరించేసి, ఆయన అనుయాయులకు 90 పైసలకు, 95 పైసలకు దోచి పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. మెడికల్‌ కళాశాలల విషయంలో జగన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో వాటిని తీసుకోవడానికి ఇప్పుడు తటపటాయిస్తున్నారు. అలాగే, పోర్టుకు దగ్గరగా ఉన్న భూములను పీపీపీ మోడ్‌లో సేకరిస్తే అధికారంలోకి రాగానే తిరిగిచ్చేస్తానంటూ ప్రకటించాలని జగన్‌ను కోరుతున్నాను.

చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం

కదం తొక్కిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, ప్రజలు

వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన నిరసన

కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన

తాడేపల్లికి సంతకాల ప్రతుల తరలింపు

భానుగుడి సెంటర్‌ నుంచి బాలాజీ చెరువు వరకూ భారీ ర్యాలీ

ఆకట్టుకున్న మోటార్‌ సైకిల్‌ ర్యాలీ

కాకినాడలో ఎగసిన జనసునామీ

కోటిగళ గర్జన1
1/7

కోటిగళ గర్జన

కోటిగళ గర్జన2
2/7

కోటిగళ గర్జన

కోటిగళ గర్జన3
3/7

కోటిగళ గర్జన

కోటిగళ గర్జన4
4/7

కోటిగళ గర్జన

కోటిగళ గర్జన5
5/7

కోటిగళ గర్జన

కోటిగళ గర్జన6
6/7

కోటిగళ గర్జన

కోటిగళ గర్జన7
7/7

కోటిగళ గర్జన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement