హిందీపై ప్రత్యేక శ్రద్ధ
హిందీ పలకడం వచ్చినప్పటికీ రాయడం సాధన చేస్తే సులువుగా ఉంటుంది. వ్యాకరణం అభ్యసించాలి. పరిచయాలు నేర్చుకోవాలి. గద్య భాగంలోని రచయితల పరిచయాలు సాధన చేయాలి. ఆధునిక పద్య భాగ సారాంశాలు నిత్యం చదివి, బాగా నేర్చుకోవాలి. పత్ర లేఖన్‌లో ఔపచారిక్ లేదా అనౌపదారిక్ పత్రాల్లో ఏదో ఒకటి నేర్చుకుంటే ఉత్తమ మార్కులు పొందవచ్చు. వాక్య దోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
– కె.సురేఖ, హిందీ ఉపాధ్యాయిని
జీవశాస్త్రంపై శ్రద్ధ చూపాలి
ప్రశ్నపత్రం ఒక్కటే అయినప్పటికీ జవాబు పత్రాలు భౌతిక, జీవ శాస్త్రాలకు వేర్వేరుగా ఇస్తారు. వివిధ వ్యవస్థలకు సంబంధించి డాక్టర్‌ను అడగాల్సిన ప్రశ్న ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. మానవుడు శ్వాస తీసుకోవడం అనే విషయం చదవాలి. ఆయుర్వేద మొక్కలు – వాటి ఉపయోగాలపై ప్రశ్న ఉంటుంది. అవయవ దానం, రక్తదానం, బాల్య వివాహాల నియంత్రణ, పర్యావరణ, నీటి, చెట్ల సంరక్షణపై స్లోగన్లు, పునశ్చరణ ముఖ్యం. గుండె, నిర్మాణం, ఫలదీకరణ విధానంపై ముఖ్యంగా దృష్టి పెట్టాలి.
– ఎం.శ్రీదేవి, బయాలజీ టీచర్
పద్యాలపై పట్టు సాధించాలి
పరిచిత పద్యాలకు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. శతక మాధుర్యంలో పద్యాల భావాలు నేర్చుకోవాలి. రామాయణంలోని కాండలు (ప్రధాన అంశాలు), వ్యాసరూప ప్రశ్నలపై పట్టు పెంచుకోవాలి. అపరిచిత గద్యాల విభాగంలో సంభాషణ, ప్రకటన, కరపత్రం, గేయం, కవితల్లో ప్రశ్నలు వస్తాయి. లఘు ప్రశ్నలైన కవి పరిచయాలు, ప్రత్యక్ష దైవాలు, జలియన్ వాలాబాగ్, ప్రకృతి సందేశంలోని కథానిక, కథ, వ్యాసాలపై సాధన చేయాలి. అలంకారాలు బాగా నేర్చుకోవాలి. బహుళైచ్ఛిక ప్రశ్నలు చదవాలి.
– ఐతి రాంబాబు, తెలుగు ఉపాధ్యాయుడు
‘భౌతిక’ంపై భయమేల!
భాష్పీభవనం, మరుగుటకు భేదా లు, హ్రస్వ, దీర్ఘ దృష్టి లోపాల సవరణ, ఎండమావులు, ఇంద్రధనస్సు ఏర్పడే విధానం, విద్యుత్ మోటార్, ఏసీ, డీసీ జనరేటర్లు పని చేసే విధానం, క్వాంటం సంఖ్యలు, పాలీ ఆప్డే, హుండ్ నియమాలు, నూతన ఆవర్తన పట్టిక నిర్మాణం, ఘన పదార్థపు విశిష్టత కనుక్కోవడం, గాజు దిమ్మె, పట్టకం వక్రీభవన చర్యలకు సంబంధించిన ప్రయో గాలు, స్ఫటిక జలం కృత్యం, ఆల్కహాల్, గ్లూకోజ్ ఆమ్లాలు చదువుకోవాలి, ఆమ్లాలు – క్షారాలు, పరమాణు నిర్మాణం వంటి వాటిపై పట్టు సాధించాలి.
– జి.శ్రీనివాస్, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు,
జి.వేమవరం
హిందీపై ప్రత్యేక శ్రద్ధ


