సాంఘిక శాస్త్రం సులువే
చరిత్రను అర్థం చేసుకుని, రాజుల పాలన గుర్తుంచుకుని, ప్రపంచ, దేశ చిత్రపటంపై పట్టు సాధిస్తే సాంఘిక శాస్త్రంలో అధిక మార్కులు పొందే అవకాశముంటుంది. భారతదేశ ప్రధాన భౌగోళిక స్వరూపాలు, పర్యావరణ ఉద్యమాలు, నేలలు – రకాలు, వ్యవసాయ పద్ధతులు, చరిత్రలో జాతీయోద్యమాలు, జాతీయాదాయం, తలసరి ఆదాయం, జలవనరులు, సంస్కృతి, ఆధునికత, ప్రపంచీకరణ వాటి పరిణామాలు, భారత ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. ప్రపంచ, భారతదేశ పటాలు గుర్తించేటప్పుడు సెక్షన్, మ్యాప్ ప్రశ్న నంబరు స్పష్టంగా రాయాలి. రాజ్యాంగం లక్షణాలపై పట్టు పెంచుకోవాలి.
– వాకాడ వెంకట రమణ, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు
గణిత సూత్రాలతో ఎక్కువ మార్కులు
గణిత సూత్రాలపై పట్టు సాధిస్తే ఎక్కువ మార్కులు పాందే వీలుంటుంది. ‘విశ్లేషణాత్మకంగా రాయండి’ అని అడిగితే సూత్రాలతో వివరించాల్సి ఉంటుంది. సూత్రాలు, త్రిభుజాలను ప్రత్యేకంగా బాగా నేర్చుకోవాలి. వాస్తవ సంఖ్యల నుంచి సమితి నిర్మాణ రూపం, రోస్టర్ రూపంలోకి మార్చడం వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. నిష్పత్తుల సమస్యలు సాధించడం. పటం ఘన పరిమాణం, ఉపరిత వైశాల్యం కనుక్కోవడం, రేఖీయ సమీకరణాలు సాధించడం, అంకశ్రేణి లేదా గుణశ్రేణి నుంచి ప్రాథమిక సమస్యలు, సాంఖ్యక శాస్త్రం నుంచి కొన్ని ప్రాథమిక సమస్యలపై ప్రశ్నలు ఇస్తారు.
– తోటకూర సాయిరామకృష్ణ, గణిత ఉపాధ్యాయుడు, సామర్లకోట
సాంఘిక శాస్త్రం సులువే


