శత ప్రణాళిక.. పదిలమేనా!
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైనది పదో తరగతి. వారి జీవితాన్ని కీలక మలుపు తిప్పి, బంగారు భవితకు పునాది వేసే తరగతి ఇది. ఉన్నత శిఖరాల అధిరోహణకు తొలి మెట్టు. అటువంటి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం తరుముకొస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి 31వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా శాఖ ఇటీవల విడుదల చేసింది. ఈ పరీక్షలకు 29,866 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి 2,315 మంది అధికంగా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
ఇదీ వంద రోజుల ప్రణాళిక
టెన్త్‌లో ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత, అత్యుత్తమ ఫలితాలు సాధించేలా జిల్లా విద్యా శాఖ అధికారులు వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 353 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ నెలలో ప్రారంభమైన ఈ ప్రణాళిక మార్చి 15 వరకూ అమలు కానుంది. జిల్లావ్యాప్తంగా పలు ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉండటంతో వారిని సర్దుబాటు చేసి పాఠాలు బోధిస్తున్నారు. ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు, సూచనలు ఇస్తున్నారు.
ప్రత్యేక తరగతులు
వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకూ రెమిడియల్ క్లాసులు నిర్వహిస్తారు. తరువాత 9.15 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నాలుగు సబ్జెక్టులు బోధిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకూ ప్రతి రోజూ ఒక సబ్జెక్టులో పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో వచ్చిన మార్కులు ఆన్‌లైన్ చేస్తారు. ఈ మార్కులపై మర్నాడు పునశ్చరణ తరగతులు ఉంటాయి. శని, ఆదివారాలు, సెలవు దినాల్లో సైతం ఈ ప్రణాళిక అమలవుతుంది. జనవరిలో కేవలం భోగి, సంక్రాంతి, కనుమ పండగలు మూడు రోజులూ మినహా మిగిలిన అన్ని రోజులూ ఈ ప్రణాళిక యథాతథంగా అమలు చేస్తారు. విద్యార్థులు ఏయే సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి, వారిలో భయాన్ని పోగొట్టి, ఆత్మవిశ్వాసం నింపేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
ఆంగ్లంపై ఆందోళన వద్దు
ఆంగ్ల పుస్తకంలో గ్రామర్, ఒకాబ్యులరీ బాగా నేర్చుకోవాలి. దీంతో పాటు రఫోస్, పోయెట్రీలోని పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటే మంచి మార్కులు పొందవచ్చు. బార్, ట్రీ డయాగ్రమ్స్ ఎక్కువ నేర్చుకోవాలి. డైరీ ఎంట్రీ, పద సమూహ ప్రశ్నలపై దృష్టి సారించాలి. లాంగ్వేజ్ స్కిల్స్ ముఖ్యం. బయోగ్రాఫికల్ స్కెచ్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ ప్రశ్నలు ఇస్తారు. వీటిని బాగా నేర్చుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. డయాగ్రమ్ ఇచ్చి స్టేట్మెంట్ రాయండి అనే ప్రశ్న అడుగుతారు. యాక్టివ్, పాసివ్ వాయిస్ నుంచి ఎక్కువగా స్టేట్‌మెంట్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
– చింతాడ ప్రదీప్ కుమార్, ఇంగ్లిష్ టీచర్
మార్చి 16 నుంచి
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు
పాఠశాలల్లో
100 రోజుల ప్రణాళిక అమలు
మెళకువలు నేర్పుతున్న టీచర్లు
సర్కారీ స్కూళ్లల్లో ఉత్తమ ఫలితాలకు కసరత్తు
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
పరీక్షలకు జిల్లాలో 29,866 మంది దరఖాస్తు
శత ప్రణాళిక.. పదిలమేనా!
శత ప్రణాళిక.. పదిలమేనా!
శత ప్రణాళిక.. పదిలమేనా!


