అందని కందిపప్పు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రేషన్‌కార్డుల ద్వారా నూనె, కందిపప్పు, గోధుమపిండి, రాగులు పంపిణీ చేస్తామని, సరకులు నెల మొత్తం అందుబాటులో ఉంచుతా మని పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా ప్రజలకు కందిపప్పు కష్టాలు తప్పడం లేదు. చంద్రబాబు ప్రభు త్వం వచ్చిన తర్వాత రేషన్ దుకాణాల్లో సక్రమంగా కందిపప్పు ఇవ్వడం లేదు. కార్డుదారులు నెలనెలా రేషన్‌దుకాణాల వద్ద డీలర్లను కందిపప్పు కోసం అడు గుతున్నా వారి దగ్గర సరైన సమాధానం ఉండడం లేదు. వచ్చే నెలలో వస్తుందని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. దీంతో సాధారణ మధ్య తరగతి ప్రజలు మార్కెట్‌లో కందిపప్పు కొనలేక రేషన్‌షాపుల్లో ఎప్పు డు కందిపప్పు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కాకినాడ జిల్లాలో 6.50 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ ప్రతి నెలా కిలో చొప్పున పంపిణీ చేయాలంటే 655 టన్నుల కందిపప్పు సరఫరా చేయాలి. కానీ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలు మాత్రమే ఈ విధంగా ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నెలలో చివరిగా కందిపప్పు ఇచ్చారు. తొమ్మిది నెలలుగా రేషన్‌షాపుల ద్వారా కందిపప్పు సరఫరా చేయడం లేదు. రెండు నెలల క్రితం దసరా, దీపావళి వంటి పండగల్లో నిరుపేద ప్రజలు కందిపప్పు కోసం ఎదురుచూశారు. అయినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది. ఈ నెలలో క్రిస్మస్ పండగ నేపథ్యంలో కందిపప్పు ఇస్తారని కార్డుదారులు రేషన్‌షాపులకు వెళ్లినా అక్కడ నిరాశ తప్పలేదు. కార్డుదారులు కేవలం బియ్యం మాత్రమే తీసుకొని ఉసూరుమంటూ వెనుతిరగాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్‌లో కొందామంటే నాణ్యతను బట్టి కిలో రూ.110 నుంచి రూ.130 వరకూ విక్రయిస్తున్నారు. రాగులు, జొన్నలు కూడా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం నెలనెలా ఇచ్చే కందిపప్పు కూడా ఇవ్వకపోవడంతో నిరుపేదలు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది.
గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే సరకులు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇంటి వద్దనే నిత్యావసర వస్తువులను అందించేందుకు ఎండీయూ వాహనాలు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వచ్చి సరకులు సరఫరా చేసేవారు. చంద్రబాబు సర్కార్ వచ్చాక రేషన్ షాపులకు వెళ్లి గంటల తరబడి క్యూ లో నిలబడినా బియ్యం, పంచదార తప్ప ఇంకేమీ దొరకడం లేదు. ఈ నెలలో కపంచదార కూడా పూర్తిగా సరఫరా చేయకపోవడంతో కార్డుదారులు తీవ్ర అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లో ఎలా ఉన్నా గ్రామాల్లో ప్రజలు కందిపప్పు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కిరణా షాపుల్లో కొనాలంటే రేటు ఎక్కువ కావడంతో ప్రభుత్వమే రేషన్‌షాపుల ద్వారా ఇవ్వాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
వినియోగదారులకు అదనపు భారం
ప్రభుత్వం గతంలో కిలో రూ.67 కే రేషన్‌షాపుల ద్వా రా కందిపప్పు సరఫరా చేసేది. దీంతో సాధారణ, మఽ ద్యతరగతి ప్రజలు కిలో కందిపప్పును నెలరోజుల పా టు పొదుపుగా వాడుకొనేవారు. తొమ్మిది నెలలుగా రేషన్‌షాపులో కందిపప్పు ఇవ్వకపోవడంతో ప్రజలు బయట మార్కెట్‌లోనే కందిపప్పు కొనుగోలు చేసుకొంటున్నారు. దీంతో వినియోగదారులు సుమారు రూ. 50 నుంచి రూ.60 అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
ప్రజలకు తప్పని అవస్థలు
నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు కడుపునిండా అన్నం తిందామన్నా కుదరని పరిస్థితి నెలకొంది. ప్రతీ నెలా 20వ తేదీ లోపు తమ షాపు పరిధిలోని కార్డుదారులకు కావాల్సిన బియ్యం, కందిపప్పు, పంచదార కోసం డీలర్లు డీడీలు తీస్తారు. రేషన్‌డీలర్లు డీడీలు తీసినా కందిపప్పు, పంచదార కూడా సరఫరా చేయడం లేదు. తొమ్మిది నెలలుగా కార్డుదారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందని డీలర్లు వాపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేయకపోయినా కార్డుదారులు తమను నిలదీస్తున్నారని, ప్రతి నెలా కార్డుదారులకు సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉందని రేషన్‌డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము డీడీలు తీసినా ఉపయోగం లేకపోవడంతో డీలర్లు డీడీలు తీయడం మానివేశారు. ప్రభుత్వం ఎప్పుడు కందిపప్పు ఇస్తే అప్పుడే డీడీలు తీయాలని నిర్ణయించుకొన్నారు.
తొమ్మిది నెలలుగా రేషన్
దుకాణాలకు సరఫరా బంద్
బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.120
ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు
ప్రకటలనకే పరిమితమైన నాయకులు
జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 6,50,716
ప్రతి నెలా 655 టన్నులు అవసరం
ఈ నెలలో కూడా కేటాయించలేదు
ఈ నెలలో కూడా జిల్లాకు కందిపప్పు ప్రభుత్వం కేటాయించలేదు. కేవలం అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే కందిపప్పు వచ్చింది. రేషన్‌షాపులకు కందిపప్పు కేటాయించలేదు. ప్రభుత్వం స్టాకు విడుదల చేయకపోవడంతో రేషన్‌షాపుల్లో కందిపప్పు పంపిణీ చేయడం కుదరలేదు.
– దేవులానాయక్, డీఎం,
జిల్లా పౌరసరఫరాలశాఖ
బయట మార్కెట్‌లో
ధరలు పెంచుతున్నారు
ప్రభుత్వం కందిపప్పు సరఫరా చేయకపోవడంతో బయట మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. ఇదే అదనుగా బయట మార్కెట్‌లో ధరలు పెంచుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతి నెలా కందిపప్పు సరఫరా చేయాలి.
– ఏలూరి రాణి, గృహిణి, కాకినాడ
అందని కందిపప్పు
అందని కందిపప్పు


