శృంగార వల్లభ స్వామి ఆలయం కిటకిట
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగారవల్లభస్వామిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కాలినడకన ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 14వేల మంది స్వామిని దర్శించుకున్నట్టు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,42,290 అన్నదాన విరాళాలు రూ.67,143, కేశ ఖండన ద్వారా రూ.5,239, తులాభారం ద్వారా రూ.300, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.19,635 ఆదాయం వచ్చిందని చెప్పారు. 3,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్వామిని దర్శించుకొని పూజలు చేశారు.
ప్రశాంతంగా
నవోదయ ప్రవేశ పరీక్ష
పెద్దాపురం (సామర్లకోట): నవోదయ విశ్వవిద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నవోదయ ఆరవ తరగతిలో ప్రవేశానికి 7,140 మంది దరఖాస్తులు చేసుకున్నారని, వారి కోసం ఉమ్మడి జిల్లాలో 32 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు నవోదయ ప్రిన్సిపాల్ బి సీతాలక్ష్మీ తెలిపారు. ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 6,034 హాజరయ్యారన్నారు.
టెట్‌కు 1,588 మంది హాజరు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్–25)కు కాకినాడ జిల్లావ్యాప్తంగా మూడు కేంద్రాల్లో పరీక్ష శనివారం నిర్వహించారు. పరీక్షకు ఉదయం 795 మంది, మధ్యాహ్నం 793మంది హాజరు కాగా 143 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఽఖాధికారి పిల్లి రమేష్ తెలిపారు. అన్ని కేంద్రాలలో పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్టు తెలియజేశారు.
అన్నవరప్పాడుకు
పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన క్యూ లో నిలబడి దర్శనం చేసుకున్నారు. అర్చకులు స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేశారు. కోనసీమ జిల్లా పెదపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి సూర్యావతి కుటుంబం ఇచ్చిన ఆర్థిక సహాయంతో 9,500 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
రాజీయే రాజమార్గం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజీ పడడమే రాజమార్గమని, ప్రతీ ఒక్కరూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జాతీయ లోక్ అదాలత్ శనివారం జరిగింది. ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌కు 46 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలానా కేసులు, ఎకై ్సజ్ విభాగానికి చెందిన డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించామన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం, తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. గత మూడు జాతీయ లోక్ అదాలత్‌లలో 10,700 కేసులు పరిష్కరించి రూ.100.99 కోట్ల ్టపరిహారం చెల్లించామన్నారు. నాలుగో జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మడి జిల్లా పరిధిలో రాత్రి 9 గంటల వరకు 16,873 కేసులు పరిష్కరించగా రూ.27.32 కోట్ల పరిహారం చెల్లించామన్నారు.
శృంగార వల్లభ స్వామి ఆలయం కిటకిట


