ర్యాంకు మెరుగుపడాలి
అన్నవరం: సత్యదేవుని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్ర స్థాయిలో ర్యాంకును మెరుగు పరచుకోవాలని అన్నవరం దేవస్థానం సిబ్బందికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఆయన సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. అనంతరం, దేవస్థానం అధికారులతో మాట్లాడుతూ, అన్నదానం హాలు వద్ద అదనంగా మరో షెడ్డు వేయాలని సూచించారు. పలు కీలక ప్రదేశాల్లో 30 టాయిలెట్లు నిర్మించాలన్నారు. దేవస్థానంలో ప్రసాద్ స్కీం నిర్మాణాలను పది నెలల్లో పూర్తి చేస్తామని ఆ విభాగం అధికారులు కలెక్టర్ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ప్రసాద్ స్కీములో పొందు పరచిన బ్యాటరీ కార్లను వెంటనే నడపాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
సీఎస్ ఆదేశాలతో..
రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో సేవలపై నవంబర్ నెలలో ఐవీఆర్‌ఎస్ ద్వారా సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో 67.8 శాతంతో అన్నవరం దేవస్థానం ఆరో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో అన్ని దేవస్థానాల ఈఓలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం విజయవాడలో సమీక్షించారు. ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్ షణ్మోహన్ అన్నవరం దేవస్థానం ఈఓ, ఇతర అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం, కలెక్టర్ స్వయంగా సమీక్షిస్తారనే సమాచారం అందడంతో శుక్రవారం ఉదయం నుంచీ దేవస్థానంలోని వివిధ విభాగాల సిబ్బంది ఫైల్స్ సిద్ధం చేసుకుని ఎదురు చూశారు. గత ఏప్రిల్‌లో అన్నవరం దేవస్థానానికి ఏడో ర్యాంకు వచ్చినపుడు కలెక్టర్ దేవస్థానానికి వచ్చి, అన్ని విభాగాలూ పరిశీలించి సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారని భావించగా, ఆయన సాయంత్రం వచ్చి, అరగంటలోనే వెళ్లిపోయారు. దీంతో, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
వైఎస్సార్ సీపీ అనుబంధ
విభాగాల్లో పలువురికి చోటు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో జిల్లా నుంచి పలువురికి అవకాశం కల్పించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా సాపిరెడ్డి చంద్రరావు (తుని నియోజకవర్గం), జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా కుచిమంచి సూర్యప్రకాశరావు (ప్రత్తిపాడు), వైఎస్సార్ టీఎఫ్ జగ్గంపేట, పెద్దాపురం, తుని నియోజకవర్గాల అధ్యక్షులుగా వేమన లక్ష్మణస్వామి, మద్దిరాల శివనాగ కృష్ణ, చింతల దొరబాబులను నియమించారు.
అన్నదాన పథకానికి రూ.లక్ష
సామర్లకోట: కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి గెడ్డమనుగు లలిత ప్రసాద్, బాలసత్యశివశ్రీ, కాంటూరి శ్యామలరావు శుక్రవారం రూ.లక్ష విరాళం సమర్పించారు.
లక్ష్యాలు చేరుకోవాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా వార్షిక రుణ ప్రణాళిక కింద వివిధ రంగాలకు నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంక్ అధికారులు విధిగా చేరుకోవాలని డీఆర్‌ఓ జె.వెంకట్రావు కోరారు. బ్యాంకర్లు, జిల్లా అధికారులతో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం కలెక్టరేట్ వివేకానంద హాలులో శుక్రవారం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ మాసాంతానికి వివిధ రంగాలకు, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు రుణాల కల్పనపై సమీక్షించారు. రానున్న మూడు నెలల్లో అమలు చేయాల్సిన ప్రణాళికలపై చర్చించారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాలో ఇప్పటి వరకూ 6,276 దరఖాస్తులు రాగా, వీటిలో 2,764 దరఖాస్తులకు రూ.23.41 కోట్ల రుణాలందించామని డీఆర్‌ఓ తెలిపారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ బీజీఆర్ నాయుడు, ఆర్‌బీఐ ఎల్‌డీఓ ఎ.రామకృష్ణ, నాబార్డ్ డీడీఎం వై.సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు.
·˘ ¿ýæMýS$¢ÌSMýS$ Ððl$Æý‡$OVðS¯]l õÜÐ]lÌS…¨…^éÍ
·˘ A¯]l²Ð]lÆý‡… §ólÐ]lÝ릯]l…
సిబ్బందికి కలెక్టర్ సూచన
ర్యాంకు మెరుగుపడాలి


