నియోజకవర్గాల్లో నిర్వహించారిలా.. | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గాల్లో నిర్వహించారిలా..

Dec 5 2025 6:09 AM | Updated on Dec 5 2025 6:09 AM

నియోజ

నియోజకవర్గాల్లో నిర్వహించారిలా..

ఎవ్వరూ రాలేదు

రైతన్నా మీకోసం కార్యక్రమం అని ఒక రోజు హడావుడి చేసి వెళ్లిపోయారు. చాలా మంది రైతులను కలవలేదు. ఆ కార్యక్రమం ఏమిటో, ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. ఏ అధికారీ నన్ను కలవలేదు. ఏమీ చెప్పలేదు. దానివల్ల ఉపయోగమేమిటో తెలియడం లేదు.

– సోడగం సూరిబాబు, రైతు, అరట్లకట్ట

మా కోసం ఏం చేశారని?

నేను ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. ఖరీఫ్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల దిగుబడి పూర్తిగా పడిపోయింది. పండిన ధాన్యం కొనే వారు లేక దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. తీవ్రంగా నష్టపోయాం. రైతన్నా మీకోసం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాకు తెలియనే తెలియదు. అయినా మాకు ఏం చేశారని వస్తారు? ముందు మా సమస్యలు పరిష్కరిస్తే చాలు.

– వీరంరెడ్డి అర్జునరావు,

రైతు, రాపర్తి, పిఠాపురం మండలం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: చేతికంది వస్తున్న పంట నోటికందుతుందనుకుంటుని ఆశ పడుతున్న తరుణంలో.. అధిక వర్షాలు.. ఆపై మోంథా తుపాను బీభత్సం.. తీవ్ర పంట నష్టాలు.. తడిసిన ధాన్యం.. కొనుగోళ్లకు సవాలక్ష నిబంధనలు.. గత్యంతరం లేక దళారులకే అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్న దుస్థితి.. తాజాగా దిత్వా తుపాను.. నయాపైసా కూడా అందని పరిహారం.. ఉచిత పంటల బీమా ఎత్తివేత.. ఇతర పంటలకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం.. ఇలా అన్నదాతలు పుట్టెడు కష్టాల్లో ఉన్న తరుణంలో.. ‘రైతన్నా మీకోసం’ పేరిట సర్కారు వారు చేపట్టిన కార్యక్రమం జిల్లాలో తూతూమంత్రంగా ముగిసిపోయింది. సమస్యలపై రైతులు ఎక్కడ తమను నిలదీస్తారోననే భయంతో కూటమి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో మొక్కుబడిగానే పాల్గొన్నారు. దీంతో, వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం సీఎం చంద్రబాబు సందేశ పత్రాలు రైతులకు ఇచ్చేందుకు మాత్రమే పరిమితమైంది. రైతుల సమస్యలు విన్న, పరిష్కరించిన దాఖలాలు లేకుండా పోయాయి.

లక్ష్యానికి దూరమై..

నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటలు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మద్దతు ధర తదితర అంశాలను ఆయా రైతు సేవా కేంద్రాల పరిధిలోని ప్రతి రైతు ఇంటికీ వెళ్లి సిబ్బంది, ప్రజాప్రతినిధులు వివరించాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. సాగులో యాంత్రీకరణ, పంట మార్పిడితో మేలు, ఎరువుల అధిక వినియోగంతో అనర్థాలు తదితర సూచనలు, సలహాలు అందజేయాలి. రైతు సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. కానీ, ఈ కార్యక్రమం ఆచరణలోకి వచ్చేసరికి ఇవన్నీ అడ్రస్‌ లేకుండా పోయాయి. అన్నదాతల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ఫొటోలకు పోజులిచ్చి మొక్కుబడి తంతుగా నడిపించేశారు. రైతుల నుంచి స్పందన లేకపోవడంతో కాకినాడ రూరల్‌, జగ్గంపేట, తుని, పెద్దాపురం నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లతోనే ఈ కార్యక్రమాన్ని ముగించాల్సి వచ్చింది.

రైతుకు అడుగడుగునా వంచన

ఫ అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అండ్‌ కో ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. మొదటి ఏడాది సాయానికి ఎగనామం పెట్టారు. రెండో ఏడాది కొంతమందికే అరకొరగా సాయం అందించి, చేతులు దులుపుకున్నారు. కౌలు రైతులనైతే పూర్తిగా గాలికొదిలేశారు.

ఫ రైతుల మేలు కోరి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి, ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. దీంతో, జిల్లాలోని 1,42,302 ఎకరాలకు చెందిన రైతులు పంటల బీమాకు దూరమయ్యారు.

ఫ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల బాధలు రైతులను వెంటాడుతున్నాయి. మరోవైపు కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో గోనె సంచుల కొరత వేధిస్తోంది. ధాన్యం అమ్మిన 24 గంటల్లోపే సొమ్ము చెల్లిస్తామని చెప్పి గత సీజన్‌ చివరలో దాదాపు నెలన్నర రోజులు జాప్యం చేశారు. ఈసారి ఖరీఫ్‌లో రైతుకు కనీస మద్దతు ధర ఏమాత్రం దక్కడం లేదు. వివిధ కారణాలతో ప్రతి బస్తాపై రూ.300కు తక్కువ కాకుండా దళారులు కోత పెడుతున్నారు.

ఫ విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకూ రైతుకు అన్ని విధాలా అండగా నిలిచేలా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి పేరును కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. వీటిలో కొన్నింటిని ఇతర కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. దీంతో, విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

ఫ ఏలేరు వరదతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పంటలన్నీ నీట మునిగిపోయాయి. 36 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే అరకొరగా కొందరికే సాయం అందించి, చేతులు దులుపేసుకున్నారు. ఏలేరుకు గండి పడి సుమారు 500 ఎకరాల్లో ఇసుక మేటలు వేయడంతో ఎకరాకు రూ.15 వేల సాయమన్నారు. కానీ, ఏ ఒక్కరికీ సాయం అందించిన దాఖలాలు లేవు.

ఫ పంపా, పిఠాపురం బ్రాంచి కెనాల్‌ (పీబీసీ) పరిధిలోని రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ, రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఈ సమస్యలను ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోలేదు.

ఫ ఇటీవలి మోంథా తుపానుతో జిల్లాలో 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంతవరకూ రైతుకు పైసా సాయం అందించలేదు.

ఫ తమ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి, ప్రచారార్భాటానికి ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహించడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

04పీటీపీ02: వీరంరెడ్డి అర్జునరావు

·˘ hÌêÏ ÐéÅç³¢…V>

పుట్టెడు కష్టాల్లో కర్షకులు

·˘ "Ððl*…£é' ç³ÇàÆý‡… FõÜ Ìôæ§ýl$

·˘ A…§ýlÇMîS A…§ýl° "A¯]l²§é™èl çÜ$T¿ýæÐ]l'

·˘ E_™èl ½Ð]l*MýS$ Ð]l$…VýSâýæ…

·˘ §ýlâêÆý‡$ÌS VýS$ò³µsZÏ «§é¯]lÅ… Mö¯]l$Vøâ¶æ$Ï

·˘ ÒsìæOò³ {ç³Õ²Ýë¢Æý‡¯ól B…§øâýæ¯]l™ø OÆð‡™èl$ÌS CâýæÏMýS$ ÐðlâýæÏ° MýS*rÑ$ ¯ól™èlË$

·˘ Ððl¬MýS$PºyìlV> "OÆð‡™èl¯é² Ò$MøçÜ…'

ఫ తుని ఎమ్మెల్యే యనమల దివ్య రైతులు తక్కువగా ఉన్న పైడికొండ పంచాయతీ ఆనూరులో ఈ కార్యక్రమంలో పాల్గొని మమ అనిపించారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో అత్యధికంగా వరి, ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు తొండంగి మండలంలో ఉన్నారు. కొద్దిపాటి వర్షానికే పంపా రిజర్వాయర్‌ నిండిపోయి, మిగులు జలాలను విడుదల చేస్తున్న సందర్భంలో తొండంగి మండలం గోపాలపట్నం, ఎ.కొత్తపల్లి, పి.అగ్రహారం, కృష్ణాపురం, దానవాయిపేట, జీఎంపేట, వేమవరం, పైడికొండల్లో వందలాది ఎకరాలు ముంపు బారిన పడుతున్నాయి. వరుస తుపాన్లతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. దీనికి తోడు ఖరీఫ్‌ ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఈ సమస్యలపై రైతులు ప్రశ్నిస్తారనే భయంతో ఎమ్మెల్యే దివ్య ఆనూరును ఎంచుకుని, ఈ కార్యక్రమాన్ని ముగించారు.

ఫ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గోకవరం, కిర్లంపూడి, గండేపల్లి మండలాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కేవలం జగ్గంపేట మండలానికే పరిమితమయ్యారు. ఈ మండలంలో 217 మంది, గోకవరంలో 345, కిర్లంపూడి మండలంలో 80, గండేపల్లి మండలంలో 216 మంది రైతులు తమకు అన్నదాత సుఖీభవ జమ కాకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు. అలాగే, పంట నష్టం పరిహారం, ఉచిత పంటల బీమా, కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ అమలు గురించి పలు సమావేశాల్లో డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని మాత్రమే చెప్పి, అధికారులు కూడా అక్కడి నుంచి బయటపడ్డారు.

నియోజకవర్గాల్లో నిర్వహించారిలా..1
1/2

నియోజకవర్గాల్లో నిర్వహించారిలా..

నియోజకవర్గాల్లో నిర్వహించారిలా..2
2/2

నియోజకవర్గాల్లో నిర్వహించారిలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement