సముద్రంలోకి కెమికల్ వ్యర్థాలు
కాకినాడ రూరల్: ఫార్మా, ఇతర పరిశ్రమల్లోని కెమికల్ వ్యర్థాలను గుట్టు చప్పుడు కాకుండా కాకినాడ సముద్రంలో కలపడాన్ని గుర్తించిన మత్స్యకారులు ఆందోళనకు దిగడంతో గురువారం ఉద్రిక్తత నెలకొంది. వాకలపూడి వద్ద బీచ్ రోడ్డును ఆనుకుని రొయ్యల ఫీడింగ్ కోసం నిర్వహించే ఒక షెడ్ ప్రస్తుతం మూతపడడంతో దానిని తమకు అనుకూలంగా మార్చుకుని పక్కనే ఉన్న కాల్వలోకి ట్యాంకర్లతో తీసుకువచ్చిన వ్యర్థాలను వదులుతున్నారు. షెడ్‌కు చుట్టూ ప్రహరీ, పెద్ద గేట్లు ఉండటంతో లోపల ఏం జరుగుతోందో బయటి వారికి తెలియని పరిస్థితి. ఏపీఐఐసీ ఏరియా నుంచి వచ్చే ఆయిల్ వ్యర్థాలతో కాల్వ నీరు నలుపు రంగులోకి మారిందని అందరూ భావిస్తారు. ఇదే అదునుగా కొన్ని నెలలుగా ఇతర ప్రాంతాల నుంచి కెమికల్ వ్యర్థాలతో కూడిన ట్యాంకర్లు షెడ్ లోపలికి వెళ్లి అక్కడ కాల్వ పక్కనే ప్రహరీకి అమర్చిన పైపు ద్వారా వ్యర్థాలను కాల్వలోకి వదులుతున్నారు. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో ట్యాంకర్ షెడ్‌లోకి వెళ్లడం గమనించిన ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులు వాచ్‌మన్‌ను నిలదీసి లోపలికి వెళ్లి పరిశీలించగా కాలువలోకి కెమికల్ వ్యర్థాలు విడిచిపెట్టడాన్ని గుర్తించారు. వెంటనే నిర్వాహకుడిని ఫోన్‌లో నిలదీయగా సరైన సమాధానం చెప్పకపోవడంతో అక్కడే రాత్రంతా కాపలా ఉండి, సూర్యారావుపేట, వాకలపూడి, షిషింగ్ హార్బర్‌పేట మత్స్యకారులు గురువారం బీచ్ రోడ్డుకు అడ్డంగా బైక్‌లు ఉంచి, బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న సర్పవరం సీఐ పెద్దిరాజు, పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. సీఐ నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. విషయం తెలుసుకున్న మత్స్యశాఖ ఏడీ కరుణాకర్, ఏడీ గోపి, తహసీల్దార్ కుమారి, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు అక్కడకు చేరుకున్నారు. కాలువ ద్వారా సముద్రంలోకి విడిచిపెట్టిన ట్యాంకర్‌లోని వ్యర్థాల శాంపిల్స్ సేకరించారు. లారీని సర్పవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. కలెక్టర్‌కు నివేదిస్తామని, పీసీబీ అధికారులు శాంపిల్స్ పరీక్షించిన అనంతరం అందులోని రసాయనాలేమిటో వెల్లడవుతాయని తెలిపారు. ఈ వ్యవహారం కొన్ని నెలలుగా సాగుతున్నట్లు తమకు అనుమానాలున్నాయని, దీనిపై రాత్రి రెక్కీ నిర్వహించడంతో గుర్తించగలిగామని మత్స్యకారుడు పాలెపు శివకిషోర్ తెలిపారు. అనంతరం కాకినాడ రూరల్ మండల షరిషత్ కార్యాలయం వద్ద ఉన్న కలెక్టర్ షణ్మోహన్‌ను మత్స్యకారులు కలిసి సముద్రంలో కెమికల్ వ్యర్థాలు కలపడం వలన చేపలు చనిపోయి, తమ జీవనోపాధి దెబ్బ తింటోందని, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మత్స్యకారులు ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. లారీని సీజ్ చేశామని, యజమానిపై కేసు నమోదు చేశామని సీఐ పెద్దిరాజు తెలిపారు. షెడ్ నిర్వాహకుడు, ట్యాంకర్‌లో కెమికల్ ఎక్కడ నుంచి తీసుకువచ్చారో వారిపై కేసులు పెడతామని సీఐ తెలిపారు.
·˘ M>MìS¯éyýl ½^ŒæÌZ VýS$r$tV> Ð]lÅÐ]làÆý‡…
·˘ Ð]l$™èlÞÅM>Æý‡$Ë B…§øâ¶æ¯]l
·˘ Ô>…í³ÌŒæÞ õÜMýSÇ…_¯]l M>Ë$çÙÅ °Ä¶æ$…{™èl׿ Ð]l$…yýlÍ A«¨M>Æý‡$Ë$
సముద్రంలోకి కెమికల్ వ్యర్థాలు


