ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఆలయంలో ఉదయం 9 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేసి, హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి గావించి, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, ప్రసాదాలు నివేదించారు. తరువాత వాటిని భక్తులకు పంపిణీ చేశారు. 40 మంది భక్తులు రూ.750 టికెట్టుతో ఈ హోమంలో పాల్గొన్నారు.
వెయిట్ లిఫ్టింగ్‌లో ద్వితీయం
తుని రూరల్: ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మండలంలోని హెచ్.కొత్తూరుకు చెందిన ములికి సత్యవతి అండర్–14 విభాగంలో ద్వితీయ స్థానం సాధించింది. కేరళలోని త్రిసూర్‌లో ఆస్మిత వెయిట్ లిఫ్టింగ్ (ఖేలో ఇండియా) పోటీలు ఈ నెల 1 నుంచి 5 వరకూ జరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న సత్యవతి ఈ ఘనత సాధించినట్టు తండ్రి సూరిబాబు తెలిపారు. ఆమెకు ప్రశంసా పత్రం, మెడల్‌తో పాటు రూ.8 వేల నగదు బహుమతి లభించింది. సత్యవతి ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లాలోని వైఎస్సార్ క్రీడా అకాడమీలో సత్యవతి ప్రస్తుతం పదో తరగతి చదువుతూ శిక్షణ పొందుతోంది. 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించి, ప్రతిభ చూపిన బాలిబాలికలను వైఎస్సార్ క్రీడా అకాడమీకి ఎంపిక చేశారు. అప్పట్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి నాలుగో తరగతి చదువుతున్న సత్యవతి ఒక్కరే ఎంపికై ంది. అప్పటి నుంచీ అక్కడే చదువుకుంటూ క్రీడల్లో తర్ఫీదు పొందుతోంది. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో బంగారు, రజత పతకాలు సాధించిన సత్యవతి ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్‌లో ద్వితీయ స్థానం సాధించడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు
డిజిటల్ ప్రోగ్రెస్ కార్డులు
గురజనాపల్లి ఉపాధ్యాయుని
వినూత్న ఆవిష్కరణ
కరప: గురజనాపల్లిలోని పబ్బినీడి పాపారావు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ ప్రోగ్రెస్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టారు. హెచ్‌ఎం ఎ.సాయి మోహన్ కథనం ప్రకారం.. ఇక్కడి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు వెలుగుబంట్ల వెంకట రమణమూర్తి ఏఐ టూల్స్ ఉపయోగించి వెబ్‌సైట్ రూపొందించారు. అందులో విద్యార్థుల ర్యాంకుల జాబితాను గురువారం ప్రదర్శించారు. ఏఐ ఆధారిత విద్యార్థుల ట్రాకింగ్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతి తెలుసుకోవచ్చు. రమణమూర్తి మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రోగ్రెస్ అడిగితే విద్యార్థి పేరు యాప్‌లో నమోదు చేసిన వెంటనే వస్తుందన్నారు. ఏ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయి.. పాఠశాలకు ఎన్ని రోజులు హాజరైంది, ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారు తదితర వివరాలు వెంటనే చెప్పేస్తుందన్నారు. వెనకబడిన సబ్జెక్టులో ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా సూచిస్తుందన్నారు. గూగుల్ జెమినీ అప్లికేషన్ ఉపయోగించి, పాఠశాల విద్యార్థుల డేటాను కొన్ని కమాండ్స్, కోడ్స్ రూపంలో ఇచ్చామని చెప్పారు. ఏదైనా పరీక్ష అయిన వెంటనే విద్యార్థులు సాధించిన మార్కులను ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారన్నారు. ఈ అప్లికేషన్‌కు రాష్ట్రంలోని విద్యార్థులందరి డేటాను అనసంధానం చేస్తే లక్షలాది మంది తల్లిదండ్రులకు తమ పిల్లల విద్యాప్రగతిని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని రమణమూర్తి వివరించారు.
ఘనంగా ప్రత్యంగిర హోమం
ఘనంగా ప్రత్యంగిర హోమం


