ఫ ‘యమ’ డేంజర్‌ | - | Sakshi
Sakshi News home page

ఫ ‘యమ’ డేంజర్‌

Dec 6 2025 7:32 AM | Updated on Dec 6 2025 7:32 AM

ఫ ‘యమ

ఫ ‘యమ’ డేంజర్‌

జిల్లాలోనే కీలకమైన రహదార్లలో ఒకటి కాకినాడ – ఉప్పాడ బీచ్‌ రోడ్డు. ఎగసి పడుతున్న కడలి అలలకు, వరుస తుపాన్లకు సాగర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతూండటంతో ఈ రహదారి తరచుగా దెబ్బ తింటోంది. ప్రస్తుతం ఎటువంటి తుపాను ప్రభావమూ లేనప్పటికీ కడలి అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. దీంతో, ఈ రోడ్డు దారుణంగా కోతకు గురవుతూ, తీవ్రంగా ధ్వంసమవుతోంది. ఉప్పాడ శివారు ఎస్సీజీఎల్‌ సమీపాన బీచ్‌ రోడ్డు ఒకవైపు పూర్తిగా కోతకు గురవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ రహదారి మరమ్మతులపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

– కొత్తపల్లి

ఒకవైపు పూర్తిగా కోతకు గురైన బీచ్‌ రోడ్డు

ప్రమాదకరంగా మారిన ఉప్పాడ – కాకినాడ బీచ్‌ రోడ్డు

ఫ ‘యమ’ డేంజర్‌ 1
1/1

ఫ ‘యమ’ డేంజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement