పీటీఏం వెలవెల | - | Sakshi
Sakshi News home page

పీటీఏం వెలవెల

Dec 6 2025 7:32 AM | Updated on Dec 6 2025 7:32 AM

పీటీఏం వెలవెల

పీటీఏం వెలవెల

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన మెగా పేరెంట్స్‌ – టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఏం) 3.0కు జిల్లాలో స్పందన కరువైంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ విద్యా శాఖ, సమగ్రశిక్ష అధికారులు వారం రోజులుగా తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారు. డీవైఈఓలు, ఎంఈఓలు, హెచ్‌ఎంలపై ఒత్తిళ్లు తెచ్చారు. ఇంత చేసినా తల్లిదండ్రుల నుంచి స్పందన పెద్దగా రాకపోవడంతో చాలాచోట్ల ఈ కార్యక్రమం వెలవెలబోయింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు వరి కోతలు, పనులు మానుకుని వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. స్థానిక ఎమ్మెల్యేలు విధిగా పాల్గొనాలని విద్యా శాఖ మంత్రి లోకేష్‌ ఆదేశించారు. అయినప్పటికీ కాకినాడ రూరల్‌, జగ్గంపేట, తుని, ప్రత్తిపాడుల్లో మాత్రమే ఆయా ఎమ్మెల్యేలు ఒక్కో పాఠశాలలో పాల్గొన్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. విద్యార్థుల అభివృద్ధి, పురోగతిపై చర్చ కంటే కూడా కార్యక్రమం నిర్వహించామా.. ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేశామా.. పనైపోయిందా.. అన్నట్టుగానే ఈ సమావేశాలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 1,280 ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం సమావేశాలు జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్‌ తెలిపారు. తొలుత తరగతుల వారీగా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారన్నారు. కాకినాడ పేర్రాజుపేట మున్సిపల్‌ పాఠశాల, ఇంద్రపాలెం జెడ్పీ హైస్కూల్‌లో జరిగిన సమావేశాల్లో కలెక్టర్‌ షణ్మోహన్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యాన్ని వివరించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్‌, ఎస్పీ బిందుమాధవ్‌లు ఏపీఎస్‌పీ, శ్రీనగర్‌ మున్సిపల్‌ పాఠఽశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

అసంతృప్తి.. ఆగ్రహం

ఫ ప్రభుత్వ ప్రచారం కోసం తప్ప ఈ సమావేశాలు విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం లేదని తల్లిదండ్రులు నిట్టూర్చారు.

ఫ కాకినాడ రూరల్‌ కరపలో తనకు నలుగురు పిల్లలుండగా ఒక్కరికి కూడా తల్లికి వందనం వేయలేదంటూ కుడుపూడి శాంతి అనే మహిళ ఎమ్మెల్యే పంతం నానాజీని నిలదీశారు.

ఫ ‘నాడు–నేడు’ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినా కనీసం పట్టించుకోవడం లేదని కొన్నిచోట్ల మండిపడ్డారు.

ఫ ప్రజాప్రతినిధులు, నామినేటెడ్‌ చైర్మన్లు ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మెగా పీటీఎంలకు హాజరయ్యారు. దీంతో, పాఠశాలలో కుల రాజకీ యాలు ఏమిటంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.

ఫ మెగా పీటీఎం నిర్వహణకు ప్రభుత్వం చాలీచాలని నిధులు కేటాయించడంతో అవి చాలక తమ జేబు నుంచి పెట్టుకోవాల్సి వచ్చిందని పలువురు హెచ్‌ఎంలు వాపోయారు.

ఫ గ్రామీణ ప్రాంతాల్లో

ఆసక్తి చూపని తల్లిదండ్రులు

ఫ మొక్కుబడిగా నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement