రెట్టింపు పరిహారం ఇవ్వాలి
భారత్‌మాల రోడ్డుకు మా వద్ద 2.5 ఎకరాలు సేకరించారు. అలాగే, మా కుటుంబ సభ్యుల నుంచి రెండెకరాలు తీసుకున్నారు. వాళ్ల భూమి ఆరెంపూడి ఉండటంతో వారికి ఎకరానికి రూ.కోటి చొప్పున 2023లోనే చెల్లించారు. మా భూమి అన్నవరం గ్రామ పరిధిలో ఉండటంతో పరిహారం ఇవ్వలేదు. వాస్తవానికి ఇద్దరి భూములూ పక్కపక్కనే ఉన్నాయి. రికార్డుల్లో సర్వే నంబర్లు, గ్రామాలు మారాయని.. అందువలన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కొర్రీ వేశారని చెబుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌కు గతంలో వినతిపత్రం ఇచ్చాం. అన్నవరం దేవస్థానానికి శుక్రవారం సాయంత్రం వచ్చిన సందర్భంగా కూడా కలెక్టర్‌కు మరోసారి వినతిపత్రం ఇచ్చాం. 2023లో పరిహారం అందుకున్న ఆరెంపూడి రైతులు ఆ మొత్తాలతో వేరేచోట భూములు కొనుక్కున్నారు. వాటి ధరలు ఇప్పుడు రెట్టింపయ్యాయి. అందువలన మాకు ఆరెంపూడి రైతులకు ఇచ్చిన దాని కన్నా రెట్టింపు పరిహారం ఇవ్వాలి. అలా ఇచ్చాకే రోడ్డు నిర్మాణం ప్రారంభించాలి.
– బండారు ముత్యాలరావు, రైతు


