
కాకినాడలో గోల్డ్‌కప్ హాకీ ఇండియా పోటీలు
● ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
● ఘనంగా ఫెన్సింగ్ పోటీల
ప్రారంభం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడలో మొదటి సారిగా గోల్డ్‌కప్ హాకీ ఇండియా చాంపియన్‌షిప్ 2026 పోటీలు జరుగుతాయని క్లబ్ ఫౌండర్ రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు పోటీల బ్రోచర్‌ను శనివారం కలెక్టర్ షణ్మోహన్‌కు అందించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 14 వరకూ ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో 12 పురుషుల జట్లు, ఆరు మహిళా జట్లు పాల్గొంటాయన్నారు.
హాకీ ఇండియా పోటీల బ్రోచర్‌ను కలెక్టర్‌కు అందజేస్తున్న క్లబ్ సభ్యులు
వాడవాడలా
వేంకటేశునామమే..
కొత్తపేట: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ యజ్ఞం శనివారం ఘనంగా ముగిసింది. చక్రస్నానం శశాస్త్రోక్తంగా జరిగింది. రాత్రి జరిగిన ఽఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీ నుంచి ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరిగే వేడుకలను తలపించాయి. ఆలయ ప్రాంగణం, మాడ వీధులను పుష్పాలంకరణలతో, క్షేత్రం అంతటా విద్యుద్దీపాలతో అలంకరించారు. నిత్యం పూజలు, అభిషేకాలు, శ్రీవారి అలంకరణలు, వాహన సేవలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవాలను తిలకించారు. ఆఖరి రోజు ఈఓ చక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఖండవిల్లి రాజేశ్వరవర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం ఉదయం నుంచి స్వామివారికి విష్వక్షేన పూజ, పుణ్యాహవచనం, మహా శాంతి హోమం, మహా పూర్ణాహుతి, ధ్వజారోహణం, నీరాజన మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
వైభవంగా చక్రస్నానం
ఉత్సవాల ముగింపునకు సూచికగా గౌతమీ నదీ తీరంలో వేలమంది భక్తుల గోవింద నామ స్మరణల నడుమ అవభృతస్నానాన్ని (చక్రస్నానం) దేవస్థానం అధికారులు, అర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం వివిధ పూజలతో పాటు మహాదాశీర్వచనం, ఏకాంతసేవ నిర్వహించారు. స్వామిని దర్శించిన భక్తులు తన్మయులయ్యారు.
యథాతథంగా ఆర్జిత సేవలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన ఆర్జిత సేవలైన అష్టోత్తర పూజలు, శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమాలు, నిత్య కల్యాణోత్సవాలు ఆదివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఈఓ తెలిపారు.
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ రూరల్ మండలం లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్‌లో అండర్–14 బాలబాలికల ఫెన్సింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సబ్ జూనియర్స్ విభాగంలో నిర్వహించే ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల పల్లి రామస్వామి, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి అధ్యక్షత వహించారు. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, సుగుణారెడ్డి పోటీలను ప్రారంభించారు. ఎంపీ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ సంఘ కార్యదర్శి కృష్ణమోహన్, మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపాల్ బొహ్రా పాల్గొన్నారు.
వైభవంగా సుదర్శన హోమం
అమలాపురం టౌన్: వేంకటేశ్వరస్వామికి ప్రీతిపాత్రమైన శనివారం రోజున ద్వాదశి కలిసి రావడంతో భక్తులు అమలాపురం స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ద్వాదశి సందర్భంగా సుదర్శన హోమం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంచిపల్లి అబ్బులు, ఈవో సత్యకుమార్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

కాకినాడలో గోల్డ్‌కప్ హాకీ ఇండియా పోటీలు